Home / ANDHRAPRADESH / పవన్‌కల్యాణ్‌‌కు కోలుకోలేని షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే రాపాక..!

పవన్‌కల్యాణ్‌‌కు కోలుకోలేని షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే రాపాక..!

2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పరువు నిలిపిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు గట్టి షాక్ ఇచ్చారు. రాజోలు నుంచి గెలిచిన రాపాక..మొదటి నుంచి పవన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతే కాకుండా వైసీపీ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నారు. నిండు అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపిస్తూ..సీఎం జగన్ మాట తప్పరు..మడమ తిప్పరూ అంటూ రాపాక కీర్తించారు.అలాగే ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం రూ. 10,000 ఆర్థిక సాయం అందించిన సందర్భంగా రాపాక స్వయంగా సీఎం జగన్ ఫోటోకు పాలాభిషేకం చేసి ప్రభుత్వాన్ని అభినందించారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ వ్వవహార శైలిపై రాపాక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో  ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన జగన్ సర్కార్‌ను బహిరంగంగా సమర్థించిన రాపాక.. అదే సమయంలొ పవన్ చేస్తున్న రాద్ధాంతాన్ని తప్పుపట్టారు.  తాజాగా పవన్ కల్యాణ్ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షకు జనసేన నేతలంతా హాజరవుతున్నా..తాను మాత్రం రావడం లేదని రాపాక ప్రకటించడం సంచలనంగా మారింది. కేవలం చంద్రబాబు ఆదేశాల మేరకే పవన్ అనవసరంగా ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను కూడా గుడ్డిగా విమర్శిస్తున్నారని రాపాక భావిస్తున్నారు. ఇక ఇటీవల పార్టీ సమావేశంలో తనను నాదెండ్ల మనోహర్ ఘోరంగా అవమానిస్తుంటే..పవన్ మౌనంగా ఉండడంపై రాపాక కినుకు వహించారు. అందుకే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటూ పవన్ దీక్షకు డుమ్మా కొడుతున్నారు. ఈ విషయాన్ని రాపాక ప్రకటిస్తూ..పార్టీ నిర్మాణం విషయంలో తనకు, అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు విబేధాలు ఉన్నాయని సంచలన వ్యాఖ‌్యలు చేశారు. అలాగే దిశ ఉదంతంలో నిందితులకు రెండు బెత్తం దెబ్బలు చాలు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించలేనని ఆయన స్పష్టం చేశారు. పార్టీ మారే అవకాశాలపై స్పందిస్తూ…ప్రస్తుతానికి జనసేనతో దూరం పెరిగిన మాట వాస్తవమే అని రాపాక తేల్చి చెప్పారు. అయితే ఇప్పటి వరకు జనసేన ఎమ్మెల్యేగానే ఉన్నానని, భవిష్యత్తులో ఏదైనా జరుగవచ్చని..అన్నారు. మొత్తంగా జనసేన తరుపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా సంక్రాంతి నాటికి వైసీపీలో చేరడం ఖాయమని..ఈ మేరకు ముహూర్తం కూడా కుదిరిందని రాజోలులో చర్చ జరుగుతుంది. ఇదే జరిగితే ఏపీ అసెంబ్లీలో జనసేన‌కు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. మరి రాపాక వైసీపీలో చేరుతాడా లేదా..జనసేన పార్టీలోనే కొనసాగుతాడా అన్నది తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat