టాలీవుడ్ సీనియర్ నటుడు.. అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రూలర్.
ఈ మూవీలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ ,వేదిక అందాలను ఆరబోయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెండో పాటను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ మూవీ ఈ నెల ఇరవై తారీఖున విడుదల కానున్నది.
పడతాడు.. తాడు అంటూ సాగే రెండో పాటను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యం అందించారు.. గాయకులు సింహా,ఛాందిని విజయ్ కుమార్ షా ఆలపించారు. చిరంతన్ భట్ సంగీత దర్శకత్వం వహించారు. మీరు ఒక లుక్ వేయండి.