భారత టెన్నీస్ క్రీడాకారిణి అయిన సానియా మీర్జా చెల్లి ఆనం మీర్జా పెళ్ళి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
నగరంలోని శంషాబాద్ లో ఒక ప్రముఖ పంక్షన్ హాల్ లో జరిగిన ఈ ఫంక్షన్ కు మెగా ఫ్యామిలీతో పాటుగా పలు రంగాలకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆనం మీర్జా పెళ్ళికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన సతీమణి అయిన ఉపాసనతో కల్సి హాజరయ్యారు.
ఈసందర్భంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే టెన్నీస్ క్రీడాకారిణిసానియా మీర్జాకు హీరో రామ్ చరణ్ మంచి స్నేహితుడు.దీంతో పాటుగా ఉపాసనతో కూడా సానియా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అందుకే సానియా ఇంట ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఈ మెగా జంట తప్పకుండా హాజరవుతారు.