Home / ANDHRAPRADESH / జగన్ విషయంలో భయపడిన ఎల్లో మీడియా.. కనీసం కిమ్మనడం లేదు!

జగన్ విషయంలో భయపడిన ఎల్లో మీడియా.. కనీసం కిమ్మనడం లేదు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ ను గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు చేసినట్టుగా ఆయన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన చంద్రబాబు అనుకూల మీడియా, మేధావి వర్గం అందరూ ఇపుడు గ‌ప్‌చుప్ అయిపోయారు. ఎవరు ఏం మాట్లాడితే ఎలాంటి విమ‌ర్శ‌లు చేస్తే ప్ర‌తి విమ‌ర్శ‌లు వ‌స్తాయోన‌ని వారంతా భయపడుతున్నారు. గ‌తంలో ఎప్పుడూ ఏ విష‌యంలో లేనివిధంగా ఇప్పుడు వారంతా పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టేందుకు చంద్రబాబుకు ఎవరూ క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. గతంలో ఏపీలోని 45 వేల ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియంను ప్ర‌వేశ పెట్టాల‌నే జ‌గ‌న్ అభిలాష‌ను ఆయన వెల్ల‌డించారో లేదో వెంట‌నే ప్ర‌తిప‌క్ష పార్టీలు, నాయ‌కులు, మీడియా అధిప‌తులంతా  పెద్దఎత్తున శోక‌ణ్ణాలు పెట్టారు. తెలుగుభాష‌ను జ‌గ‌న్ ఖూనీ చేస్తున్నార‌ని, అంతంత మాత్రంగా ఉన్న తెలుగు ఈదెబ్బ‌తో మొత్తం నాశ‌నం అయిపోయింద‌ని, చ‌రిత్ర‌లో క‌లిసి పోవ‌డం ఖాయమ‌ని, మ‌న‌ది ఆంగ్ల ప్ర‌దేశేన‌ని ఇలా ఎవ‌రికివారు ఉప‌న్యాసాలిచ్చేశారు.

 

 

 

 

 

చాలామంది వ్యాసాలు కుమ్మ‌రించేసి ఉదాహ‌ర‌ణ‌లు వ‌ల్లె వేసేశారు. ఇంట‌ర్వ్యూలు కుమ్మేస్తూ డిబేట్లు పెట్టేసారు. రోజులత‌ర‌బ‌డి జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు సంధించారు. చంద్రబాబుకు అండగా ఉండే మ‌రో ప‌త్రికాధినేత త‌న ప‌లుకులతో తెలుగు మాధ్య‌మం ప్లేస్‌లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావ‌డంవల్ల రాష్ట్రంలో క్రిస్టియానిటీని పెంచాల‌ని జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న పలు చెత్త వ్యాఖ్య‌లు చేశారు. దీనికి ఉదాహ‌ర‌ణ‌లు ఆయ‌న చెప్పేలేకపోయినా అనవసరమైన వ్యాఖ్యలన్నీ చేసారు. ఇదిలా వుంటే జ‌గ‌న్ తర‌ఫున ఓ నినాదం తెర‌మీదికి వ‌చ్చింది. మీపిల్ల‌లు మాత్ర‌మే ఇంగ్లీష్ మీడియంలో చ‌దువుకోవాలి.. పేద‌ల పిల్లలు మాత్రం తెలుగును రక్షించాలి- అదేనా? అని జగన్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా మీడియాధినేతలు ఇలా అందరినీ ప్రశ్నించారు.  అప్ప‌టివ‌ర‌కూ తెలుగుకోసం శోక‌ణ్ణాలు పెట్టుకున్న‌వాళ్లంతా ఒక్క‌సారిగా యూట‌ర్న్ తీసేసుకున్నారు. తాము ఆంగ్ల మాధ్యమానికి వ్య‌తిరేకం కాదని కొత్తరాగం అందుకున్నారు. దీంతో అందరూ శభాష్ జగన్ పచ్చమీడియా నోరు మూయించారు అనుకున్నారు. మరోవైపు తప్పుడు వార్తలు, నిరాధార వార్తలు రాస్తే తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరించడంతో ఇపుడెవ్వరూ కిమ్మనడంలేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat