Home / NATIONAL / లోక్ సభ, రాజ్యసభ స్థానాల పెంపు..!

లోక్ సభ, రాజ్యసభ స్థానాల పెంపు..!

దేశంలో ప్రస్తుతం 130 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నారు. కానీ పెరిగిన జనాభాకు అనుగుణంగా లోక్ సభకు ప్రాతినిధ్యం వహించే వారి సంఖ్య లేదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. భారత్ పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించే స్థానాలు సంఖ్యను 543 కాగా వాటిని 1000కు పెంచాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అబిప్రాయపడ్డారు. 1971 జనాభా లెక్కల ప్రకారం భారత్ జనాభా 55 కోట్లు మాత్రమేనని దానికి అనుగుణంగా 1977 లో 543 లోక్ సభ స్థానాలను ఏర్పాటు చేశారని ప్రస్తుతం ఇంకా వాటినే కొనసాగిస్తున్నామని, సుమారు 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విధి విధానాలను ప్రస్తుతం పెరిగిన జనాభా ఆధారంగా మార్చవలసిన అవసరం ఉన్నదని, ప్రస్తుత జనాభా 130 కోట్లు దాటిందని అన్నారు. పెరిగిన జనాభాకు అనుగుణంగా పరిపాలన యంత్రాంగం లో మార్పులు తీసుకురావలసి ఉన్నదని లోక్ సభ స్థానాలను 1000 కి పెంచాలని అలానే రాజ్యసభ సభ్యుల సంఖ్య కూడా పెంచాలని ఆయన అన్నారు. ఇండియా ఫౌండేషన్‌ నిర్వహించిన కార్యక్రమంలో అటల్‌ బిహారీ వాజ్‌పేయి స్మారకోపన్యాసం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat