Home / MOVIES / ఆ కోరికను తీర్చుకున్న కాజల్ అగర్వాల్

ఆ కోరికను తీర్చుకున్న కాజల్ అగర్వాల్

అప్పుడేప్పుడో పన్నెండేళ్ల కిందట విడుదలైన చందమామ మూవీతో మొదటి విజయాన్ని అందుకుని .. తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టి.. ఆ తర్వాత వరుస విజయాలతో.. వరుస చిత్రాల్లో ఒక పక్క అందాన్ని ఆరబోస్తూనే.. మరోపక్క చక్కని అభినయాన్ని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుని. ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు చేరుకున్న అందాల రాక్షసి.. మిల్క్ బ్యూటీ కాజల్ అగర్వాల్.

తాజాగా ఈ ముద్దుగుమ్మ విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్ సరసన భారతీయుడు2 లో నటిస్తుంది. మరోవైపు ముంబై సగ అనే హిందీ మూవీలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. ఇప్పటివరకు అన్ని భాషాల్లో నటించి అందరి అభిమానాన్ని చురగొన్నది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక మేడమ్ టుస్పాడ్స్ సంస్థ ప్రజల సందర్శనార్థం సింగపూర్ లోని మ్యూజియంలో కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహాన్ని ఉంచుతున్నట్లు తెలిపింది.

ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు చెందిన కొలతలు తీసుకున్నారు అని సమాచారం. వచ్చేడాది ఫిబ్రవరి 5 తారీఖు నుండి ప్రజలకు అందుబాటులోకి రానున్నది . ఇదే విషయాన్ని ఈ ముద్దుగుమ్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేస్తూ”నాకు ఆ కల నెరవేరింది అని సంతోషాన్ని వ్యక్తం చేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat