Home / ANDHRAPRADESH / విజయవాడలో సిమ్స్ భరత్ రెడ్డి ఆధ్వర్యంలో కన్నులపండుగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు..!

విజయవాడలో సిమ్స్ భరత్ రెడ్డి ఆధ్వర్యంలో కన్నులపండుగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు..!

బెజవాడ కృష్ణా నదీ తీరం జై జగన్ నినాదాలతో మార్మోగిపోయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు విజయవాడలో కృష్ణా నదీతీరాన పద్మావతి ఘాట్‌లో రెండు రోజుల పాటు కన్నుల పండుగగా జరిగాయి. స్విమ్స్ విద్యాసంస్థల అధినేత బి. భరత్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ బర్త్‌డే వేడుకలు ఆద్యంతం కన్నులపండుగగా సాగాయి. గురువారం సాయంత్రం రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమెరికా, స్పెయిన్, ఆస్ట్రియా, థాయ్‌లాండ్, టర్కీ దేశాలకు చెందిన పారా గ్లైడర్లతో ఏర్పాటు చేసిన ఎయిర్‌షో చూపరులను ఆకట్టుకుంది. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆకర్షణీయంగా రూపొందించిన పోస్టర్లతో పారా గ్లైడర్లు ఆకాశాన విహరిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఇక చారిత్రాత్మక దిశ చట్టాన్ని తీసుకువచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు చెబుతూ రూపొందించిన వేదిక అందరిని ఆకట్టుకుంది. ఈ వేదికపై దిశ చట్టం, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులపై విద్యార్థినులు ప్రదర్శించిన స్కిట్లు ప్రతి ఒక్కరిని కదిలించాయి. అలాగే జబర్దస్ ఫేం రచ్చ రవి తన కామెడీ స్కిట్లతో అలరించాడు.

జననేత జన్మదిన వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ.. సీఎం జగన్ జన్మదినోత్సవాన్ని ముందుగా నిర్వహించిన స్విమ్స్ విద్యాసంస్థల డైరెక్టర్ భరత్‌రెడ్డిని అభినందించారు. ఆడవాళ్లు అర్థరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని మహాత్మాగాంధీ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ..మహాత్ముడు కలలు కన్న నిజమైన స్వాతంత్ర్యం రాష్ట్రంలో జగన్ పాలనలోనే సాధ్యమవుతుందని సుచరిత అన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సీఎం జగన్ తీసుకువచ్చిన దిశ చట్టం 2019 అందుకు నిదర్శనమని ఆమె అన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌లు కూడా ఈ కార్యక్రమంలో జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ..బర్త్‌డే వేడుకలను రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్న భరత్‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు.  స్విమ్స్ విద్యాసంస్థల అధినేత భరత్‌ రెడ్డి మాట్లాడుతూ వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తొలి జన్మదినోత్సవం కావటంతో నగరంలో ఎంతో వైభవంగా రెండు రోజుల పాటు వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. సీఎం జగన్ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన అవయవదానం కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఎంతో మంది యువతీ, యువకులు, నేతలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అవయవదానం అంగీకారపత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి స్విమ్స్ విద్యార్థిని, విద్యార్థులు, మహిళలు, వైసీపీ శ్రేణులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ముఖ్యంగా దిశ చట్టాన్ని తీసుకువ్చిన సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెబుతూ ప్రత్యేకంగా రూపోందించిన టీషర్ట్ ధరించిన యువతులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.  మొత్తంగా స్విమ్స్ భరత్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన జననేత జగన్ జన్మదిన వేడుకలు రాజధానివాసులను విశేషంగా ఆకట్టుకున్నాయనడంలో సందేహం లేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat