Home / ANDHRAPRADESH / రంగా వర్థంతి వేడుకలు.. రాధాపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!

రంగా వర్థంతి వేడుకలు.. రాధాపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!

బెజవాడలో స్వర్గీయ వంగవీ రంగా వర్థంతి వేడుకలను పార్టీలకతీతంగా నిర్వహిస్తున్నారు. పేదల పెన్నిధిగా గాంచిన నాయకుడు వంగవీటి రంగా 31వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. కాగా విజయవాడలో అన్ని వర్గాల ప్రజల మన్నలను పొంది..కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన వంగవీటి రంగా ఎన్టీఆర్ హయాంలో అర్థరాత్రి హత్యకు గురైన సంగతి తెలిసిందే. రంగా హత్యలో చంద్రబాబుకు, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావుకు భాగస్వామ్యం ఉందని ఇప్పటికీ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అయితే రంగా వారసుడిగా ఎదిగిన వంగీవీటి రాధా రాజకీయంగా తప్పటడుగులు వేస్తూ..ఆయన పరువును బజారును పెడుతున్నారని నిజమైన రంగా అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం పార్టీకి, అక్కడ నుంచి వైసీపీలో చేరిన రంగాకు అధ్యక్షుడు జగన్ సముచిత ప్రాధాన్యమే ఇచ్చారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాధాకు మచిలిపట్నం నుంచి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారు. అయితే రంగా మాత్రం జగన్‌తో విబేధించి, చంద్రబాబు తాయిలాలకు లొంగిపోయి తన తండ్రిని చంపించిన టీడీపీలో చేరారు. దీంతో రంగా అభిమానులు రాధా టీడీపీలో చేరడం పట్ల  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా రాధా ఆ ఎన్నికల్లో లోకేష్‌తో కలిసి ఎన్నికల ప్రచారం చేశాడు. అంతే కాదు రంగాను చంపింది మనుష్యులే కానీ టీడీపీ కాదని రాధా చెప్పడం నిజమైన  రంగా అభిమానుల మనసులను గాయపర్చింది. తాజాగా ఇవాళ బెజవాడలో నిర్వహించిన రంగా వర్థంతి సభలో బీజేపీ నేత వంగవీటి నరేంద్ర రాధా వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు. ఈ ఏడాదే వంగవీటి రంగా మొదటి వర్ధంతి అని నరేంద్ర అన్నారు. తన తండ్రిని చంపిన తెలుగుదేశం పార్టీలో వంగవీటి రాధ ఎప్పుడైతే చేరారో.. అప్పుడే వంగవీటి రంగా నిజంగా చనిపోయారని నరేంద్ర ఉద్వేగానికి గురయ్యారు. గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా వంగవీటి మోహన రంగా వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నామని వంగవీటి నరేంద్ర తెలిపారు. రంగాను చంపింది మనుషులు కానీ.. పార్టీ కాదు రాధా బాబు అనడం.. రంగ-రాధా అభిమానులు జీర్ణించుకోలేక పోయారన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ప్రచారానికి వెళ్లిన వంగవీటి రాధాను మండపేటలో రంగా అభిమాన సంఘాలు వ్యతిరేకించాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా వంగవీటి రంగాను చంపింది టీడీపీ నాయకులేనని రాధా తెలుసుకోవాలని నరేంద్ర విఙ్ఞప్తి చేశారు. మొత్తంగా రంగా వారసుడు రాధా తీరుపై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat