Home / ANDHRAPRADESH / విశాఖలో రాజధాని రాకుండా అడ్డుకునేందుకు ఆ రూట్‌లో చంద్రబాబు కుట్ర చేస్తున్నాడా..!

విశాఖలో రాజధాని రాకుండా అడ్డుకునేందుకు ఆ రూట్‌లో చంద్రబాబు కుట్ర చేస్తున్నాడా..!

ఏపీకి మూడు రాజధానులపై జగన్ సర్కార్‌ నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైజాగ్‌లో పరిపాలనా రాజధాని, కర్నూలులో జ్యుడీషియల్ రాజధాని ఏర్పాటును చంద్రబాబు వ్యతిరేకిస్తూ..మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ నినదిస్తున్నాడు. అంతే కాదు అమరావతి గ్రామాల్లో రైతులు చేస్తున్న ఆందోళలను దగ్గరుండి నడిపిస్తున్నాడు. అయితే వైజాగ్‌లో పరిపాలనా రాజధాని ఏర్పాటును ఉత్తరాంధ్ర టీడీపీ నేతలంతా స్వాగతిస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి గంటా, బాలయ్య అల్లుడు భరత్‌తో సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులంతా సమావేశమై తీర్మానం చేసి చంద్రబాబుకు పంపించారు. అయినా చంద్రబాబు మాత్రం ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకంటే..తమ సామాజికవర్గం ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నాడు. వైజాగ్‌లో రాజధాని వస్తే…సీమ నుంచి కబ్జాదారులు, ముఠాకోరులు వచ్చి భూములు దోచుకుంటారని ఎల్లోమీడియాలో దుష్ప్రచారం చేయిస్తున్నాడు. అంతే కాదు..రాయలసీమ టీడీపీ నేతల దగ్గర విశాఖపై, ఉత్తరాంధ్ర టీడీపీ నేతల దగ్గర కర్నూలుపై విషం కక్కుతూ..ప్రాంతీయ విద్వేషాలు రగిలిస్తున్నాడు. అలాగే విశాఖ రక్షణపరమైనది కాదని, నావికాదళ అధికారులపై హనీ ట్రిప్ జరిగిందని, పాకిస్తాన్‌కు దేశ రక్షణ వ్యవహారాలు తెలిసిపోయాయని, అలాగే విశాఖకు తుఫానులు తరచుగా వస్తుంటాయని…రాజధానిగా విశాఖ ఏ మాత్రం సేఫ్ కాదని చంద్రబాబు ఎల్లోమీడియాతో పచ్చ కథనాలు ప్రసారం చేయిస్తున్నాడు. మొత్తంగా విశాఖలో రాజధాని రాకుండా అన్నీ అమరావతిలోనే ఉండేలా చంద్రబాబు తన జిత్తులమారి తెలివితేటలతో స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

 

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దేశంలో చంద్రబాబును మించిన నాయకుడు లేరు. దోచుకున్న వేల కోట్ల డబ్బులతో మీడియాను, న్యాయవ్యవస్థలనే తన చెప్పుచేతల్లో ఉండేలా చూసుకోవడం బాబు దిట్ట. తాజాగా మరోసారి న్యాయవ్యవస్థ ద్వారా విశాఖకు రాజధాని రాకుండా అడ్డుకునేందుకు బాబు కుట్ర చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే విషయంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకుండా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. తనకు అనుకూలమైన కొందరు వ్యక్తుల ద్వారా విశాఖలో రాజధాని ఏర్పాటుకు న్యాయపరమైన అడ్డంకులు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. న్యాయవ్యవస్థను అడ్డంపెట్టుకుని ప్రజలకు ద్రోహం తలపెట్టేపనికి పూనుకున్నారని ఆరోపించారు. చంద్రబాబుతో పాటు కొందరు అనుకుల వ్యక్తుల ప్రమేయంతో ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి, దాని చుట్టుపక్కల వేల ఎకరాల భూముల్ని కొని.. వాటిని లాభానికి అమ్మేసుకుని.. వచ్చిన డబ్బుతో విదేశాల్లో ఆస్తులు కూడబెట్టాలన్నది చంద్రబాబు, ఆయన కొడుకు పప్పునాయుడి ప్లాన్” అని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల్ని ప్రకటించబోతున్నదని, అయితే ప్రభుత్వ ఉద్దేశాన్ని నీరుగార్చాలన్న టార్గెట్ తోనే విశాఖలో రాజధాని ఏర్పాటును అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, ఆయనకు ప్రజలే గట్టిగా బుద్ధిచెబుతారని విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. మొత్తంగా విశాఖలో రాజధాని ఏర్పాటును అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నాడంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat