సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి వస్తున్న మరో రొమాంటిక్ హాట్ సినిమా బ్యూటిఫుల్. ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. వర్మకు క్లాసిక్గా పేరు తెచ్చిన రంగీలకు కావ్య రూపంలో వస్తుంది. దీనికి వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే తన శిష్యుడు కోసం వర్మ ప్రొమోషన్స్ భారీగా చేస్తున్నాడు. ఈమేరకు ట్విట్టర్ ని ఆయుధంగా చేసుకున్నాడు. తాజాగా ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ కు మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు వర్మ. రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్యూటిఫుల్ మూవీ టికెట్స్ 31రాత్రి బుకింగ్ ఓపెన్ కానున్నాయి. థియేటర్లో టిక్కెట్లు కొనుగోలు చేసిన మొదటి 50 మందికి నేను, నైనా గంగూలీ, పార్థుశ్రీ అగస్త్య ఆటోగ్రాఫ్ చేసిన పోస్టర్ ఇస్తామని అన్నారు.