Home / CRIME / అమెరికాలో తెలంగాణ యువతి మృతి

అమెరికాలో తెలంగాణ యువతి మృతి

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన చరితారెడ్డి మృతి చెందింది.

చరితా రెడ్డి తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఒక కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరితారెడ్డి బ్రెయిన్ డెడ్ అయినట్లు ముస్కాన్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

చరితారెడ్డి భౌతికాయాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చరితారెడ్డి సరిగ్గా నాలుగేళ్ల కిందట ఎమ్మెస్సీ చేసేందుకు అమెరికాకు వెళ్లారు.