Home / ANDHRAPRADESH / సీఎం జగన్ ఫోటోకు పాలాభిషేకం చేసిన ఏపీయస్‌ఆర్టీసీ కార్మికులు..!

సీఎం జగన్ ఫోటోకు పాలాభిషేకం చేసిన ఏపీయస్‌ఆర్టీసీ కార్మికులు..!

నూతన సంవత్సరం నాడు జగన్ సర్కార్ ఏపీయస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది. ఈ రోజు నుంచి ఆర్టీసీ కార్మికులు అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందుతారు.ఈ మేరకు ప్రభుత్వం నోటీఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జనవరి 1 న కొత్త సంవత్సర సంబురాల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులు తాము ఇదే రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. బుధవారం విజయవాడలో ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. కార్మికులంగా హర్షం వ్యక్తం చేశారు. కేట్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తమ చిరకాల స్వప్నం నెరవేర్చిన సీఎం జగన్‌కి కార్మికులు జేజేలు పలికారు. దశాబ్దాల కల సాకారం చేసి కార్మికుల బతుకులకు భరోసా కల్పించిన సీఎం జగన్‌ కలకాలం వర్ధిల్లాలని కార్మికులు నినాదాలు చేశారు. వేలాది కుటుంబాల్లో వెలగులు నింపిన సీఎం జగన్‌కి ఆజన్మాంతం రుణపడి ఉంటామని ఆర్టీసీ కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. జనవరి ఒకటో తేదీని కార్మికులు ‘ఆర్టీసీ పండుగ’గా అభివర్ణించించారు. ఈ సంబరాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు దేవినేని అవినాష్‌, బొప్పనభవకుమార్‌ పాల్గొని.. ఆర్టీసీ కార్మికులను అభినందించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన మాటమీద నిలబడ్డ మడమతిప్పని నేత సీఎం వైఎస్‌ జగన్‌ అని ప్రశంసించారు. జగన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నుంచే ఆంధ్రప్రదేశ్‌లో స్వర్ణయగం మొదలైందని అవినాష్‌ తెలిపారు. బొప్పన భవకుమార్‌ మాట్లాడుతూ.. ఏడాది గడవక ముందే ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌ సొంతమని కొనియాడారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగ ఆర్టీసీ కార్మికులు సంబురాలు చేసుకుంటున్నారు. సీఎం జగన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. నిజంగా ఆర్టీసీ కార్మికులకు జనవరి 1 పండుగ రోజే అని చెప్పాలి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి, వారి బతుకుల్లో వెలుగులు నింపిన సీఎం జగన్‌‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat