Home / ANDHRAPRADESH / బ్రేకింగ్..టీడీపీకి రాజీనామా చేసిన లోకేష్ సన్నిహితుడు..!

బ్రేకింగ్..టీడీపీకి రాజీనామా చేసిన లోకేష్ సన్నిహితుడు..!

అమరావతిపై రాజకీయ రచ్చ జరుగుతున్న వేళ…టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజధాని ప్రాంతంలో వరుస షాక్‌లు కలుగుతున్నాయి… రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేయగా.. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కూడా రాజీనామా బాటలో ఉన్నారు. ఇక బెజవాడలో కీలక యువనేత అయిన దేవినేని అవినాష్ ఇటీవల టీడీపీకి గుడ్‌బై చెప్పి…వైసీపీలో చేరారు. తాజాగా మరో కీలక యువనేత ఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి తన పదవికి రాజీనామా చేసి టీడీపీకి గట్టి షాక్ ఇచ్చారు. ఈ మేరకు ఏకంగా చంద్రబాబుకు లేఖ రాసి సంచలన విషయాలను ప్రస్తావించి మరీ తప్పుకున్నారు. ఈ బ్రహ్మం చౌదరి చినబాబు లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు…లోకేష్ తరపున మొన్నటి ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. యువత ఓట్లను ముఖ్యంగా తన కమ్మ సామాజికవర్గం యువతను టీడీపీవైపు మళ్లించడంలో బ్రహ్మం చౌదరి కీలక పాత్ర వహించారు. అయితే లోకేష్‌తో పాటు గతంలో తెలుగు యువత అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు వైసీపీలో చేరిన యువనేత దేవినేని అవినాష్‌కు కూడా బ్రహ్మం చౌదరి అత్యంత సన్నిహితుడు..అవినాష్‌ ప్రోద్బలం వల్లే బ్రహ్మం చౌదరి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. లోకేష్‌కు అత్యంత సన్నిహితుడే పార్టీ మారడం రాజకీయంగా సంచలనంగా మారింది. అయితే అమరావతిలోనే రాజధాని ఉండాలని చంద్రబాబు రైతుల ఆందోళనలను వెనుక ఉండి నడిపిస్తున్నా.. .టీడీపీ నేతలు వరుసగా రాజీనామా చేయడం పట్ల పార్టీ శ్రేణులు నివ్వెరపోతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు సామాజికవర్గం బలంగా ఉన్న కృష్ణా , గుంటూరు జిల్లాలో ఆయన సామాజికవర్గానికే చెందిన వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, బ్రహ్మం చౌదరి వంటి కీలక నేతలు పార్టీని వీడడం టీడీపీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి…రాజధాని జిల్లాలలో పట్టు నిలుపుకునేందుకుగాను… చంద్రబాబు అమరావతిపై చేస్తున్న రాజకీయం బెడిసికొడుతున్నట్లు అనిపిస్తోంది. వైసీపీ టీడీపీ కీలక నేతలను తమవైపుకు తిప్పుకోవడం ద్వారా అమరావతి ఉద్యమం ద్వారా రాజధాని జిల్లాలలో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు చెక్ పెడుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే..కృష్ణా, గుంటూరు జిల్లాలలో కూడా టీడీపీ ఉనికి కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా లోకేష్ సన్నిహితుడే పార్టీ మారడంపై టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat