Home / SLIDER / దేశీయ శీతల పానీయం నీరా

దేశీయ శీతల పానీయం నీరా

 
తాటి, ఈత చెట్లు కేవలం కల్లును ఉత్పత్తి చేసే వృక్షాలుగానే చాలామందికి తెలుసు. కానీ అనేక పోషక, ఆరోగ్య గుణాలున్న అరుదైన దేశీయ ఆరోగ్య పానీయమైన నీరాను కూడా అందిస్తాయి. తాటి, ఈత, ఖర్జూరా, జీరిక, కొబ్బరి వంటి చెట్ల నుంచి కారే తీయటి పానీయం నీరా. ఆల్క హాల్‌ ఏమాత్రం లేని నీరా ఎన్నో పోషక విలువలు కలిగిన దేశీయ పానీయం. మన ప్రభుత్వం నీరా అమ్మకాలను అనుమతిస్తూ జీవోఎంఎస్‌ 116ని జారీ చేసిన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
 
 
నీరాను ప్రధానంగా తాటి, ఈత చెట్ల నుంచి తీస్తారు. ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత కొత్త కుండను తినే సున్నపుతేటతో శుభ్రంగా కడిగి అది ఆరిన తర్వాత కొంత సున్నపుతేటను కుండలో వేసి సాయంత్రం సమయంలో చెట్టుకు అమర్చుతారు. సూర్యోదయం కన్నా ముందే కుండను దింపి వెంటనే అతి తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచుతారు. సూర్యోదయం తర్వాత తీసినా, ఎండ, గాలి ఎక్కువగా తగిలినా తొందరగా పులిసిపోతుంది. కొబ్బరి నీళ్లకంటే ఇది ఎంతో శ్రేష్ఠంగా, రుచికరంగా ఉంటుంది. దీనిని కల్లుగా గుర్తించరు. ఇందులో మత్తు పదార్థం ఉండదు కనుక నిషా వచ్చే అవకాశాలులేవు.అయితే తాటిచెట్ల నుండి నేరుగా సేకరించిన నీరాను ఎక్కువ రోజులు నిల్వచేసే అవకాశాలు లేకపోవడంతో శాస్త్రీయ పద్దతిలో నీరాను నిల్వచేయడానికి తెలంగాణ నీరా తాటి ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ గత రెండున్నర సంవత్సరాలుగా అనేక వ్యయప్రయాసాలకోర్చి పలు ప్రయోగాలు చేసి విజయం సాధించింది.
 
నిజానికి చెట్టునుంచి సేకరించిన నీర రెండు మూడు గంటలు మాత్రమే నిల్వ ఉంటుంది. ఆ తర్వాత అది పులిసిపోతుంది. దాన్ని శుద్ధిచేసి బాటిళ్ల్లలో నింపి శీతలీకరిస్తే మూడు నుంచి ఆరునెలల వరకు నిల్వచేయవచ్చని పరిశోధనలు స్పష్టం చేస్తున్నా యి. పూణాలోని నేషనల్‌ కెమికల్‌ లాబొరేటరీలో నీరా, స్వచ్చమైన తాటిని ఆరు నెలలపాటు నిల్వ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేశారు. నీరాను ఏడాది పొడవునా నిల్వ ఉంచే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తూ. గో. జిల్లా పందిరి మామిడిలోని డా.వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇప్పుడు తెలంగాణలో ఉత్పత్తి అయిన నీరాను ఇక్కడే శాస్త్రీయంగా శీతలీకరించి తెలంగాణలో నీరా అవసరాన్ని అందరికీ అర్థమయ్యేలా తెలంగాణ నీరా తాటి ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ విస్తృత ప్రచారాన్ని చేపట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీ మూలంగా ఇక్కడే ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసి నీరాను శీతలీకరించే అవకాశం ఉంది.
 
ప్రభుత్వ పాలసీ
రాష్ట్రంలో నీరా అమ్మకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. చెట్ల నుంచి నీరా సేకరణ, అమ్మకాలు కొనసాగించేందుకు పదేళ్ల కాలపరిమితితో లైసెన్సులు మంజూరు చేయనుంది. నీరాను శీతల పానీయంగా దుకాణాల్లోనూ అమ్ముకునేందుకు వీలు కల్పించనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్‌ చట్టంలోని నిబంధనలకు సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 
నిబంధనలు
– లైసెన్సు లేని వ్యక్తి చెట్టు ఎక్కకూడదు. నీరాను సేకరించ రా దు. నీరాను ఇతర వినియోగం కోసం తయారు చేయరాదు.
– గౌడ కులస్థులు, ప్రభుత్వం గుర్తించిన గీతకార్మిక సంక్షేమ సంఘాల సభ్యులు మాత్రమే లైసెన్సులు పొందేందుకు అర్హులు.
– నీరా లైసెన్సులను కల్లు విక్రయ లైసెన్సులుగా మార్చేందుకు అనుమతి లేదు.
– లైసెన్సు కోసం సంక్షేమ సంఘాల ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి.
– నీరాను తెలంగాణ ఖాదీ పరిశ్రమల మండలి, బెల్లం, పంచదార తయారీ సంఘాలు, బీసీ కార్పొరేషన్‌, గీత సమాఖ్యలు ఏర్పాటు చేసిన పరిశ్రమలకు విక్రయించవచ్చు.
– నీరాను ఆల్కహాలేతర పానీయాలకు మాత్రమే వినియోగించాలి.
– కమిషనర్‌ అనుమతించిన దుకాణాల్లో నీరాను శీతల పానీయంగా విక్రయించవచ్చు.
– ప్రాంతాలవారీగా చెట్లను ఆయా సంఘాలకు కేటాయిస్తారు.
– నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తారు.
– ఇతర పదార్థాలతో కలిసి కల్తీ చేయడం నిషేధం
 
ప్రభుత్వ దుకాణాలు:
ప్రస్తుతం ప్రభుత్వమే నీరా దుకాణాలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. మొదట ట్యాంక్‌బండ్‌ మీద స్టాల్‌ ఏర్పాటు చేస్తామని, తరువాత దశలవారీగా అన్ని జిల్లాల్లోనూ నీరా ఉత్పత్తి, సరఫరా చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
 
శాస్త్రీయ పద్దతిలో నిల్వచేయడం
శాస్త్రీయ పద్దతిలో నిల్వచేసే పద్దతిని నీరా,తాటి ఉత్పత్తిదారుల అభివృద్ధి సంస్థ అనుసరిస్తున్నది. పందిరిమామిడిలో ఉన్న పరిశోధన కేంద్రంలో ప్రస్తుతం ఈ పద్దతిలో నీరాను ఉత్పత్తిచేస్తున్నారు. ఇది ముప్పై నుండి నలభై రోజుల వరకు నిల్వ ఉంటుందని సంస్థ నిర్వాహకులు తెలుపుతున్నారు. పూర్తిగా స్టెరిలైజ్‌ చేసిన రీతిలో నీరాను నిల్వచేయనున్నట్లు వారు తెలిపారు. తెలంగాణలో సేకరించిన నీరాను ప్రస్తుతం పరిశోధనా కేంద్రంలో ఫిల్టరేషన్‌, క్లారిఫికేషన్‌,86 డిగ్రీల వద్దస్ట్రీమ్‌లో పాస్టరేషన్‌ చేసి తిరిగి 4 డిగ్రీల వద్ద స్టెర్లింగ్‌ చేస్తారు. ఆ తరువాత స్టాండరైజేషన్‌ చేసి అవసరమైన ప్లెవర్‌ను కలుపుతారు. అలా తయారైన నీరాను బాటిళ్లలో నింపి సీల్‌ చేస్తారు. బాటిళ్లను కూలింగ్‌ చేసి ఆ తర్వాత ఫ్రిజ్‌లో నిల్వచేస్తారు. ఇలా తయారైనా నీరా నెలరోజులకు మించి నిల్వ ఉంటుంది.
 
ప్రకృతి ఇచ్చిన ద్రావణం: ఈత, తాటిచెట్ల నుండి వచ్చే ఆరోగ్యద్రావణం నీరా. ఇది తియ్యటి మాధుర్యం కలిగిన అనుభూతినిచ్చే పానీయం. రోజుకు కనీసం 100-200 మిల్లీ లీటర్ల నీరా సేవించడం ఆరోగ్యానికి మంచిది.
 
పౌష్టిక ఆహార గుణాలు: ప్రతి 100 ఎం ఎల్‌ నీరాలో 264 కె.సి.యస్‌ ప్రొటీన్‌., పిండి పదార్థం, జీరోశాతం కొవ్వు, లవణాలు, ఐరన్‌, మెగ్నీషియం, జింక్‌, క్యాల్షియం, సోడియం, పొటాషియం ఉంటాయి. ఎస్కార్టీస్‌ ఆసిడడ్‌, నికోటిన్‌, రీబోప్లానిన్‌ విటమిన్స్‌ మెండుగా ఉన్నాయి.
 
అనుబంధ ఉత్పత్తులు: నీరా నుంచి ఔషధ విలువలున్న ఖరీదైన తాటి బెల్లం, చక్కెరను ఉత్పత్తి చేయవచ్చు. ఇది డయాబెటీస్‌ నియంత్రణకు చక్కగా ఉపయోగపడుతుంది. పొటాషియం, మెగ్నీషియం విరివిగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తాటి కలకండ, తాటి షుగర్‌ క్యాండీ, తాటి పౌడర్‌తో పాటు తాటి బెల్లం పాకం కూడా తయారు చేయవచ్చు. తాటిబెల్లం పాకంతో విటమిన్లు, మినరల్స్‌ అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యాకి ఎంతో మంచిదని పరిశోధనలో తేలింది.
 
నీరాతో ఉపయోగాలు
– నీరా ఒక ఎనర్జీ డ్రింక్‌, గ్యాస్‌ను తక్కువ చేస్తుంది.,
– మలబద్దకం నుంచి విముక్తి కలిగిస్తుంది.
– కంటిచూపును మెరుగుపరుస్తుంది,
– లివర్‌ సంబంధిత వ్యాధులకు నివారిణిగా పనిచేస్తుంది.
– కామెర్లు, ఫ్యాటిలివర్‌, లివరోసిన్‌నుండి నీరా కాపాడుతుంది. గుండె పనిచేసే విధానాన్ని మెరుగు పరుస్తుంది.,
– కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది. వచ్చిన రాళ్లను కరిగిస్తుంది.
– క్యాన్సర్‌ వచ్చే అవకాశాన్ని తక్కువ చేస్తుంది.
 
నీరాలోని ఔషధ గుణాలు..
– నీరాలో ఉండే సుక్రోస్‌, ప్రొటీన్స్‌ సహజసిద్ధమైన తీపితో పాటు శక్తినిస్తాయి.
– తెల్లకల్లులో ఉండే ప్రో బయోటిక్స్‌ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
– మినరల్స్‌ రక్తకణాలను వృద్ధి చేస్తాయి.
– ముఖ్యంగా నీరా తాగితే ఫ్లోరోసిస్‌ తీవ్రత తగ్గుతుంది.
– తాటి బెల్లం, షుగర్‌(పామ్‌ షుగర్‌)ను డయాబెటీస్‌ ఉన్నవారూ వాడవచ్చు.
– నీరా, తాటిపండ్లు ఆయుర్వేదంలో విరివిరిగా వాడుతారు.
– నీరాలో ఆల్కహాల్‌ ఉండదు. తాటికల్లులో కేవలం నాలుగు శాతం మాత్రమే ఆల్కహాల్‌ ఉంటుంది.
 
కులవృత్తికి ఉపాధి
గడచిన రెండున్నర సంవత్సరాలుగా నీరా విషయంలో మా సోసైటీ అనేక పరిశోధనలు చేసింది. నీరాతో కలిగే లాభాలను వివరిస్తూ నీరా అమ్మకాలకు అనుమతులివ్వాలని కోరుతూ ప్రతి ప్రభుత్వానికి విన్నవించాం. శ్రీనివాస్‌గౌడ్‌ మంత్రి అయ్యాక ఆయన కృషితో నీరా అమ్మకాలకు అనుమతులు లభించాయి. తెలంగాణ ప్రభుత్వం నీరా అమ్మకాలకు అనుమతి ఇవ్వడం ద్వారా మంచి ఆరోగ్యకరమైన ద్రావణాన్ని ప్రజలకు అందించినట్లయింది. మరోవైపు కులవృత్తి వారికి ఉపాధి అవకాశాలు కల్పించిన వారమవుతామన్న ఆశ ఉంది.
– మద్దెల రమేష్‌బాబుగౌడ్‌,అధ్యక్షులు, తెలంగాణ నీరా, తాటి ఉత్పుత్తుల అభివృద్ధి సంస్థ
 
సహజసిద్ధంగానే..
కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక తదితర దేశాల్లో నీరా ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలోనూ గతంలో నీరా ఉత్పత్తి ఉండేది. దీన్ని ఔషధంగా వినియోగించారు. భవిష్యత్‌లో సహజ సిద్ధ నీరాను పూర్తిస్థాయిలో ఉత్పత్తిచేసి అందుబాటులోకి తీసుకు వస్తాం.
– వి.సత్యంగౌడ్‌, కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ నీరా, తాటి ఉత్పుత్తుల అభివృద్ధి సంస్థ

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat