Home / ANDHRAPRADESH / మూడు రాజధానులపై రచ్చ చేస్తున్న చంద్రబాబుకు షాక్ ఇచ్చిన హైకోర్ట్…!

మూడు రాజధానులపై రచ్చ చేస్తున్న చంద్రబాబుకు షాక్ ఇచ్చిన హైకోర్ట్…!

అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందంటూ..చంద్రబాబు రాజధాని గ్రామాల రైతుల్లో లేనిపోని భయాందోళనలను రేకిస్తూ..రాజకీయం చేస్తున్నాడు. అయితే ప్రభుత్వం అమరావతి నుంచి పూర్తిగా రాజధానిని విశాఖకు తరలిస్తామని ఎక్కడా ప్రకటించడం లేదు.అధికార, వికేంద్రీకరణ దిశగా అమరావతని లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా కొనసాగిస్తూనే విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటు దిశగా ముందడుగు వేస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం తన బినామీ భూములకు విలువ పడిపోతుందనే భయంతో అమరావతి ముద్దూ..మూడు రాజధానులు వద్దూ అంటూ రాజధాని గ్రామాల రైతులను రెచ్చగొడుతున్నాడు. రాజధాని అమరావతి నుంచి పూర్తిగా తరలిపోతుందంటూ రైతుల్లో భావోద్వేగాలను రగిలిస్తున్నాడు. అలాగే అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలను హింసాత్మకంగా మార్చేందుకు బాబు కుట్రలు చేస్తున్నాడు. అలాగే కోర్టుల ద్వారా కూడా మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయగానే కోర్టుల్లో రైతులతో కేసులు వేయించేందుకు బాబు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ క్రమంలో రాజధాని తరలింపుపై ఏపీ హైకోర్టులో వేసిన దాఖలైన ఓ పిటీషన్‌‌ను విచారిస్తూ హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాజాగా రాజధానిని అమరావతి నుంచి వైజాగ్‌కు తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని, అందువల్ల ఈ పిటీషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని న్యాయవాది కొర్రపాటి సుబ్బారావు సీజే జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ మంథాట సీతారామమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ… రాజధాని తరలింపుపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏవైనా అధికారిక ఉత్తర్వులు వచ్చాయా? అని ప్రశ్నించింది. లేదని సుబ్బారావు చెప్పడంతో, అలాంటప్పడు ఈ అంశంపై తామెలా జోక్యం చేసుకోగలమని పిటీషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇంత అత్యవసరంగా ఈ అంశంపై విచారించాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. మరీ అత్యవసరం అనుకుంటే సంక్రాంతి సెలవుల తరువాత పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని న్యాయవాది కొర్రపాటి సుబ్బారావుకు స్పష్టం చేసింది.

అయితే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినా..శాసన, పరిపాలనా సంబంధమైన విషయాల్లో ఇటు హైకోర్టు కానీ, అటు కేంద్రం కానీ జోక్యం చేసుకునే అవకాశం లేదు..ఒక వేళ జోక్యం చేసుకున్నా, ప్రభుత్వానికి సూచనలు చేయడమే తప్పా. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ.. ఆదేశాలు జారీ చేయలేదు. ఈ విషయం తెలిసి కూడా బాబు బ్యాచ్ కోర్టుల ద్వారా మూడు రాజధానుల ఏర్పాటును అడ్డుకోవాలని విశ్వప్రయత్నం చేస్తోంది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బాబు తర్వాతే ఎవరైనా..కోర్టులను కూడా మేనేజ్ చేసి 18 కేసుల్లో స్టే తెచ్చుకున్న ఘనుడు. అందుకే ఆ ధైర్యంతోనే అమరావతిపై కూడా కోర్టులకు ఎక్కుతున్నాడు..కాని ఈసారి బాబుగారి పప్పులేం ఉడికేలా లేవు..మూడు రాజధానులు ఏర్పాటు అనేది ప్రజల ప్రయోజనాల కోసం కాబట్టి కోర్టులు కూడా అడ్డుకోలేవనే చెప్పాలి. మొత్తంగా కోర్టుల ద్వారా మూడు రాజధానులను అడ్డుకోవాలనుకుంటున్న చంద్రబాబుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat