Home / MOVIES / అల వైకుంఠపురములో మూవీ రివ్యూ..!

అల వైకుంఠపురములో మూవీ రివ్యూ..!

మూవీ : అల వైకుంఠపురములో
నటీనటులు: అల్లు అర్జున్,పూజా హెగ్డె, టబు ,సుశాంత్,నవదీప్,నివేదా         పేతురాజు,సముద్రఖని,బ్రహ్మనందం,సునీల్,రాజేంద్రప్ర్తసాద్,బ్రహ్మాజీ,మురళి శర్మ,సచిన్ ఖేడ్కర్, రోహిణి,రాహుల్
రామకృష్ణ ,వెన్నెల కిషోర్,అజయ్ ,తనికెళ్ల భరణి మొదలైనవారు
బ్యానర్ : గీతా ఆర్ట్స్,హారిక అండ్ హాసిని క్రియేషన్స్
నిర్మాత : అల్లు అరవింద్,ఎస్. రాధాకృష్ణ
రచన,కథ,మాటలు,దర్శకుడు : త్రివిక్రమ్ శ్రీనివాస్
సంగీత దర్శకుడు: ఎస్.ఎస్ తమన్
సినిమాటోగ్రఫీ : పీఎస్ వినోద్
ఎడిటింగ్ :నవీన్ నూలి

టాలీవుడ్ స్టైల్ స్టార్ యంగ్ హీరో అల్లు అర్జున్ ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో గతంలో జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి అనే మూవీలే ముందు గుర్తుకు వస్తాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రాలు మంచి విజయవంతమవ్వడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ ను కురిపించింది. ముచ్చటగా మూడో చిత్రంగా వచ్చిన మూవీ అల వైకుంఠపురములో. మరి గతంలో వచ్చిన చిత్రాల మాదిరిగా ఈ మూవీ అందర్నీ ఆకట్టుకుందా..?. కథ ఏమిటీ..?. స్టైల్ స్టార్ అభిమానుల అంచనాలను ఈ చిత్రం అందుకుందా..?. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము.

అసలు కథ ఏంటీ..?

రామచంద్ర(జయరాం)ఆఫీసులో ఉద్యోగిగా పనిచేస్తుంటాడు వాల్మీకి(మురళి శర్మ). వీరిద్దరికీ ఒకేసారి ఒకే ఆస్పత్రిలో కవల పిల్లలు జన్మిస్తారు. అయితే దురదృష్టం కొద్ది రామచంద్ర దంపతులకు జన్మించిన బిడ్డ పురిటిలోనే చనిపోయాడని భావించి వాల్మీకి తనకు పుట్టిన బాబును తన యజమానికిస్తాడు. అయితే ఇలా మార్చుకున్న తర్వాత ఆ బిడ్డ బతికి ఉన్న విషయాన్ని వాల్మీకి గ్రహిస్తాడు. ఆ తర్వాత వీరిద్దరు ఎప్పుడు కలిశారు. అసలు ఎందుకు అలా మార్చుకున్నారు..?. మార్చుకున్నాక జరిగిన సంఘటనలు.. పరిస్థితులు.. మధ్యలో హీరోయిన్ పూజా హెగ్డే ఎలా పరిచయమైంది..?. అసలు సముద్రఖని (అప్పలనాయుడు)ఎవరు..?ఇలా తదితర అంశాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే..?

మూవీ ఎలా ఉందంటే..?

ఈ చిత్రం పూర్తిగా కామెడీ ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్మెంట్ గా సాగేది. ఒక ధనవంతుడు కుమారుడు ఒక పేదవాడింట్లో.. పేదవాడి కుమారుడు ఒక ధనవంతుడింట్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ చిత్రం యొక్క కథాంశం.ఇలాంటి కథతో చాలా చిత్రాలు గతంలో వచ్చిన కానీ ఈ మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన మార్కును చూపించాడు. ప్లేస్ మారిన పోజిషన్ మారదు అనే కథాంశంతో దర్శకుడు తెరకెక్కించాడు. హీరోయిన్ పూజా హెగ్డే ఆఫీసులోకి ఎంట్రీ అయిన దగ్గర నుండి.. అల్లు అర్జున్ ఆమెను ప్రేమించండం .. వీరిద్దరి మధ్య చోటు చేసుకునే సన్నివేశాలు ..సినిమా నేపథ్యమంతా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శైలీలో కొనసాగుతుంది. రామచంద్ర కుటుంబం కష్టాల్లో ఉన్న సంగతి తెల్సుకుని హీరో అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఎంట్రీ దగ్గర నుండి చోటు చేసుకునే సంఘటనలు.. సన్నివేశాలే ఈ మూవీ యొక్క మెయిన్ కథాంశం.ఈ చిత్రంలో క్లైమాక్స్ లో చోటుచేసుకునే ట్విస్ట్ ఎవరూ
ముందే ఊహించి ఉండరు

ఎవరు ఎలా చేశారంటే..?

హీరో అల్లు అర్జున్ మొట్టమొదటిసారిగా ఫుల్ లెంత్ కామెడీ ,యాక్షన్ ఎంటర్ ట్రైన్మెంట్ ఒరియేంటేడ్ మూవీలో నటించి మెప్పించాడు. తనదైన మార్కులో కన్పిస్తూ కామెడీ ,యాక్షన్ ,తిరుగులేని పంచులతో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. అల వైకుంఠపురములో కి హీరో ఎంట్రీ అయిన దగ్గర నుండి చోటు చేసుకునే సన్నివేశాలు,సంఘటనలు ,యాక్షన్ సీన్స్,కామెడీ సీన్స్ అన్ని ఆకట్టుకున్నాయి.

గతంలో వచ్చిన డీజేలో బన్నీ సరసన నటించిన పూజా హెగ్డే అందాలను ఆరబోయడమే కాకుండా చక్కని అభినయాన్ని ప్రదర్శించింది. తాజా చిత్రంలో అంతకంటే అందాలను ఆరబోసి.. తన పాత్రకు పరిధి మేరకు నటించి మంచి మార్కులను తెచ్చుకుంది. పాటల్లో మరింత అందంగా.. సెక్సీగా నటించి వహ్వా అన్పించుకుంది.

ఇక హీరో బన్నీ తండ్రి పాత్రలో నటించిన మురళి శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఒక మధ్యతరగతి తండ్రిగా.. మధ్యతరగతి కుటుంబ యజమానిగా.. ఉద్యోగిగా నటించిన తీరు శర్మను మరో మెట్టు పైకి ఎక్కించింది. సినిమాసాంతం తన మేనరిజంతో అందర్నీ ఆకట్టుకున్నాడు మురళి. తనకు వచ్చిన పాత్రకు వందకు రెండు వందల శాతం న్యాయం
చేకూర్చిన నటుడు మురళి శర్మ.

అల వైకుంఠపురములో మిగతా నటులైన టబు,జయరాం,సుశాంత్,నవదీప్,సునీల్ ,రాహుల్ రామకృష్ణ,రావు రమేష్,అజయ్,బ్రహ్మాజీ,రోహిణిలు తమ పాత్రలకు మేర నటించారు. సముద్రఖని విలన్ పాత్రలో మెప్పించాడు

సాంకేతిక వర్గం ఎలా ఉంది..?

ఇటీవల వచ్చిన అరవింద సమేత లాంటి మూవీ తర్వాత అల వైకుంఠపురములో లాంటి మూవీని ఎంచుకోవడం త్రివిక్రమ్ శ్రీనివాస్ గట్స్ కు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఈ సినిమాలో ఫూర్తిగా సీరియస్ తో కూడిన కథ ఉంటే ఈ మూవీలో మాత్రం తనదైన శైలీలోని కామెడీ,పంచ్ డైలాగ్ లు,కథ,కథాంశం బాగా పేలాయి. ప్రతి సన్నివేశాన్ని తనదైన మార్కులో చూపించాడు. నేను గెలవడం కంటే మీరు కలవడం ఇంపార్టెంట్,ఎప్పుడూ పిల్లలు బాగుండాలని అమ్మానాన్న అనుకోవాలా..?. అమ్మానాన్న బాగుండాలని పిల్లలు అనుకోరా లాంటి డైలాగ్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

సాంకేతికంగా మూవీ చాలా చక్కగా వచ్చాయి. సంగీతం దగ్గర నుండి లైటింగ్ బాయ్ వరకు ఇరవై నాలుగు ఫ్రేమ్స్ చక్కగా కుదిరాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ రిచ్ నెస్ కన్పిస్తుంది. ఈ చిత్రం విడుదలకు ముందే పాటలు ఎంతగా ఆదరణను పొందాయో అందరికీ తెల్సిందే. నవీన్ నూలి ఎడిటింగ్ మూవీకి ప్లస్.సెకండాప్ లో కొన్ని సన్నివేశాలకు ఇంకాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగా కుదిరాయి

బలాలు
* అల్లు అర్జున్ నటన
*కామెడీ
*పంచ్ లు
* పాటలు
* యాక్షన్ సన్నివేశాలు
* క్లైమాక్స్

బలహీనతలు
* రోటీన్ కథ
* ఓవర్ యాక్టింగ్
* సెకండాప్ లో కొన్ని సన్నివేశాలు
* కొన్ని కొన్ని చోట్ల స్లోగా నడిచే సన్నివేశాలు

బాటం లైన్ – బన్నీ సినిమా తీయడంలో గ్యాప్ తీసుకుననడు కానీ కామెడీ పంచడంలో కాదు(త్రివిక్రమ్ శైలీలో)

రేటింగ్ –2.75/5

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat