Home / ANDHRAPRADESH / చంద్రబాబుకు మైండ్ బ్లాక్…ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై పోసాని ఆసక్తికరవ్యాఖ్యలు..

చంద్రబాబుకు మైండ్ బ్లాక్…ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై పోసాని ఆసక్తికరవ్యాఖ్యలు..

పోసాని కృష్ణ మురళి..తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు..రచయితగా, సినీనటుడిగా పేరుగాంచిన పోసాని మంచి రాజకీయ విశ్లేషకుడు కూడా…సమకాలీన రాజకీయాలపై ముక్కుసూటిగా స్పందిస్తారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ తరపున గొంతు వినిపించిన సినీ నటుల్లో పోసాని ముందు వరుసలో ఉంటారు..అలాగే అమరావతి రైతుల ఆందోళనలపై సాటినటుడు, వైసీపీకే చెందిన పృధ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలను పోసాని తీవ్రంగా ఖండించారు.

 

తాజాగా ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ..జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై స్పందించారు. భవిష్యత్తులో స్వర్గీయ ఎన్టీఆర్ మనవడైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా సీనియర్ ఎన్టీఆర్ ఇలాంటి పరిస్థితుల్లోనే పార్టీ పెట్టి వియం సాధించారని పోసాని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూడా అప్పట్లో ఉన్న పరిస్థితులే ఉన్నాయని..కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కనుక మంచి మనసు పెట్టి రాజకీయాల్లోకి వస్తే..కచ్చితంగా 2024లో ఎన్టీఆర్‌ ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని పోసాని జోస్యం చెప్పారు.

 

కాగా ఇప్పటికే చంద్రబాబు తీరుతో, లోకేష్ అసమర్థతపై విసిగిపోయిన టీడీపీ నేతలు పార్టీ పగ్గాలు చేపట్టాలని జూనియర్ ఎన్టీఆర్‌ను కోరుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు 2024లో నెక్ట్స్ సీఎం ఎన్టీఆర్ అన్నట్లుగా ఫ్లెక్సీలు కూడా వేశారు. ఈ విషయమై పలువురు నేతలు స్వయంగా ఎన్టీఆర్‌ను కలిసి టీడీపీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాల్సిందిగా వత్తిడి తీసుకువస్తున్నారంట..జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే…టీడీపీ నేతలంతా చంద్రబాబును దించేసి నాయకత్వ బాధ్యతలు ఎన్టీఆర్‌కు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపినట్లు సమాచారం.కాని సినిమాల్లో కెరియర్ పీక్స్‌లో ఉన్న సమయంలో రాజకీయాల్లోకి ఇప్పుడే ఎంట్రీ ఇవ్వడం కరెక్ట్ కాదని ఎన్టీఆర్ తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

 

అయితే 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని టీడీపీలో చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ కనుక రాజకీయాల్లోకి అడుగుపెడితే టీడీపీ పూర్తిగా చంద్రబాబు కుటుంబం నుంచి మళ్లీ నందమూరి కుటుంబం చేతుల్లోకి వెళ్లడం ఖాయమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒక వేళ టీడీపీ పగ్గాలు తన చేతికి రాకపోతే..తాత సీనియర్ ఎన్టీఆర్‌ వారసుడిగా కొత్త రాజకీయపార్టీ పెట్టె ఉద్దేశంలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్లు సమాచారం. మొత్తంగా 2024లో జూనియర్ ఎన్టీఆర్ ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని పోసాని చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat