Home / ANDHRAPRADESH / ఏ1గా చంద్రబాబుపై కేసు…!

ఏ1గా చంద్రబాబుపై కేసు…!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేసా.. ఇప్పటికే పలు కేసుల్లో స్టేలు తెచ్చుకున్న ఆయనపై కేసు ఎందుకు నమోదు అవుతుంది అని ఆశ్చర్యపోతున్నారా..?. కానీ ఇది నిజం. రాజధాని పరిధిలోని ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ఉద్ధేశ్యపూర్వకంగానే భూఅక్రమణలకు పాల్పడ్డారని ఏపీ ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది అని సమాచారం.

ఇదే విషయాన్ని నిన్న మంగళవారం ఏపీ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ప్రకటించింది కూడా. ప్రత్యేక విచారన బృందంతో జరిపిన పలు తనిఖీల్లో సుమారుగా పద్దెనిమిది వందలకు పైగా డాక్యుమెంట్లను పరిశీలించి స్పష్టమైన ఆధారాలను ఈ బృందం గుర్తించింది. వీటిలో బాబుకు చెందిన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న హెరిటేజ్ సంస్థ భూలావాదేవీల విషయంపై ప్రధానంగా లెక్కలు తేల్చింది. దీంతో 2014లో రాజధానిని ప్రకటన కంటే ముందే అతితక్కువ ధరలకు కొప్పురావూరు పరిధిలో భూములు కొనుగోలు చేసింది. టీడీపీకి చెందిన అప్పటి మంత్రులు ,ఎమ్మెల్యేలు రాజధాని ప్రకటనకు నెలా రెండు నెలల ముందే తర్వాత భూములను కొన్నారని ఈ బృందం నిర్ధారణకు వచ్చింది.

చంద్రబాబుతో సహా మొత్తం నలబై మందికిపైగా కేసులను నమోదు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మరో ఒకటి రెండు రోజుల్లో ఈ వ్యవహారం బయటకు వస్తుంది సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు నాయుడును పెట్టిన ప్రభుత్వం మాజీ మంత్రులు నారాయణ,ప్రత్తిపాటి పుల్లారావు,దూళిపాళ్ల నరేంద్ర్త,లోకేశ్ బినామీలు ,వేమూరి ప్రసాదు,బాలకృష్ణ మేనల్లుడు కొమ్మాలపాటి శ్రీధర్ ,జీవి అంజనేయులు,ఎంపీగా ఉన్న బీజేపీ నేత ,కోడెల కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. వీరందరిపైనా కేసులు నమోదు చేయనున్నట్లు తెలిసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat