టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్‌లో నితిన్ ఉంటారు. ప్రస్తుతం ‘భీష్మ: ది బ్యాచిలర్’ అనే సినిమా చేస్తున్నారు. ఇక తన బ్యాచిలర్ స్టేటస్‌కి ఫుల్‌స్టాప్ పెట్టి ఓ ఇంటివాడు కాబోతున్నారని తెలిసింది. నితిన్ కార్యక్రమానికి వెళ్లినా, ఇంటర్వ్యూలు ఇచ్చినా ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు’ అనే కామన్ క్వశ్చన్ ఆయన ముందు ఉంటుంది. అయితే, ఎట్టకేలకు నితిన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు సమచారం. మే నెలలో నితిన్ పెళ్లి ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని తెలిసింది. నితిన్ చేసుకోబోయే అమ్మాయి పేరు షాలినీ . యూకేలో ఎంబీఏ చేసిన శాలినిని నితిన్ నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నారట. వీరి ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు తెలియజేసి పెళ్లికి ఒప్పించారని టాక్. ఇది పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం అని భోగట్టా. ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభించారట ఇరు కుటుంబ సభ్యులు.