Home / ANDHRAPRADESH / చంద్రబాబుకు మాజీ టీడీపీ నేత దిమ్మతిరిగే కౌంటర్…!

చంద్రబాబుకు మాజీ టీడీపీ నేత దిమ్మతిరిగే కౌంటర్…!

వికేంద్రీకరణ బిల్లును కుట్రపూరితంగా అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉత్తరాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. కేవలం తన సామాజికవర్గ ప్రయోజనాల కోసం దశాబ్దాలుగా వెనుకబడిన ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషం కక్కుతున్నారని ఉత్తరాంధ్ర నేతలు, వివిధ సంఘాల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా అమరావతి కోసం ఉత్తరాంధ్ర, రాయలసీమకు ద్రోహం చేస్తున్న చంద్రబాబు తీరును మాజీ టీడీపీ నేత, వుడా మాజీ ఛైర్మన్‌ ఎస్‌ఏ రెహమాన్ తీవ్రంగా ఎండగట్టారు. అమరావతికి మద్దతుగా రాష్ట్రమంతటా తిరుగుతానన్న చంద్రబాబు ఇప్పుడు ఎందుకు తిరగడం లేదని రెహమాన్‌ ప్రశ్నించారు.

గత ఐదేళ్లు చంద్రబాబు అంధ్రప్రదేశ్‌ను సన్‌రైజ్‌ స్టేట్‌ అన్నారని…కాని సన్‌ అంటే తన కొడుకు అన్నది ఆయన ఆలోచనని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లు చంద్రబాబు తన సన్‌ను రెయిజ్ చేశారు కానీ స్టేట్‌ను ముఖ్యంగా విశాఖను ఏమాత్రం పట్టించుకోలేదని రెహమాన్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా వికేంద్రీకరణ విషయంలో చంద్రబాబుకు అన్నీ తెలుసు. కానీ దేన్నీ సవ్యంగా తీసుకెళ్లరు. ఆయన మనసులో ఉండేది ఒకటి. పైకి చెప్పేది మరొకటి. విశాఖలో రాజధాని కావాలని ఎవరడిగారని బాబు ప్రశ్నిస్తున్నారు. మరి అమరావతిని రాజధాని చేయాలని మిమ్మల్ని ఎవరడిగారు అని అంటూ రెహమాన్ చంద్రబాబుకు అదిరిపోయే ప్రశ్న సంధించారు.

విశాఖ రాజధాని కావాలని 1953లోనే చట్టసభ తీర్మానం చేసింది. అది ఎవరికీ తెలయదులే అని బాబు అనుకున్నారని రెహమాన్ విమర్శించారు. చంద్రబాబు ఉత్తరాంధ్రకు వచ్చి రాజధాని వద్దని ప్రజలతో అనిపించే దమ్ముందా? అని సవాల్ విసిరారు…యూటర్న్‌ చంద్రబాబు ప్రధాని మోదీ మీద విషపోరాటం చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాకుండా చేశారని ఆక్షేపించారు. ఇక టీడీపీ ఎమ్మెల్సీలను సీఎం జగన్ ప్రలోభపెడుతున్నారంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలపై రెహమాన్ స్పందిస్తూ… చంద్రబాబు 23 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను చేరదీసి పదవులిచ్చిన మాట వాస్తవం… కానీ ఆయనే టీడీపీ ఎమ్మెల్సీలను సీఎం వైఎస్‌ జగన్‌ కొనబోయారని ఆరోపించడం హాస్యాస్పదమని అన్నారు… మీరు ఐదేళ్లు ఓపిక పట్టండి ప్రజలే తీర్పు ఇస్తారు…అంతేకాని…ఇలా గాడిదలు లొట్టిపిట్టలతో పిచ్చి ఉద్యమాలు చేయడం మానాలని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ అమరావతే రాజధాని అనే నినాదంతో పోటీ చేయాలి. ఇదే రిఫరెండంగా తీసుకుందాం’అని రెహమాన్‌ సవాల్‌ విసిరారు. మొత్తంగా నిబంధనలకు వ్యతిరేకంగా వికేంద్రీకరణ బిల్లును కుట్రపూరితంగా అడ్డుకున్న చంద్రబాబుపై రెహమాన్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat