Home / SLIDER / కమిషన్ చైర్మన్ పదవి అని కాకుండా బాధ్యతతో పని చేస్తున్నా

కమిషన్ చైర్మన్ పదవి అని కాకుండా బాధ్యతతో పని చేస్తున్నా

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ కు సంబంధించిన సావనీర్,2018-19ఏడాది కమిషన్ పనితీరు,ఈ ఏడాది డైరీ ఆవిష్కరణ పబ్లిక్ గార్డెన్లోని ప్రియదర్శిని ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొప్పుల ఈశ్వర్,మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు.తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకకు కమిషన్ సభ్యులు,కమిషన్ సెక్రటరీ కరుణాకర్,ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ సెక్రటరీ అజయ్ మిశ్రా,బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఎం లక్ష్మయ్య పాల్గోన్నారు..

*కమిషన్ చైర్మన్ పదవి అని కాకుండా బాధ్యతతో పని చేస్తున్నా* -చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎస్సీ,ఎస్టీ వర్గాల అభ్యున్నతికై అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి..అమలు చేస్తున్నారు.ఆయా వర్గాలకు సామాజిక భద్రతకై భరోసానిస్తూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు. నాపై నమ్మకంతో నాకు చైర్మన్ పదవీ బాధ్యతలు అప్పజెప్పారు.నాటి నుండి నేటి వరకు కమిషన్ చైర్మన్ ను పదవి అని భావించకుండా బాధ్యతతో ఆయా వర్గాల అభ్యున్నతికై పని చేస్తున్నాను.కమిషన్ కార్యాలయాన్ని నాంపల్లి నుండి బషీర్ బాగ్ పరిశ్రమల భవనలోకి తరలించడమే కాకుండా ఎస్సీ,ఎస్టీల ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించి కార్యాలయాన్ని సరికొత్త ఆధునీక పద్ధతుల్లో నవీనకరించాము..కార్యాలయానికి ప్రతి నిత్యం మూడు వందల నుండి నాలుగు వందల మందిదాక తమ తమ సమస్యలను విన్నవించుకోవడానికి..తమ గోడుని చెప్పుకోవడానికి వస్తుంటారు..ప్రతి ఒక్కర్ని ప్రేమగా ఆహ్వానించి వారి సమస్యలను,కష్టాలను చాలా ఓర్పుగా విని వెంటనే పరిష్కరించేలా తాము చొరవ చూపుతున్నామని అన్నారు.ఇంకా మాట్లాడుతూ” కమిషన్ చరిత్రలోనే తొలిసారిగా 95% పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము.త్వరలోనే వందకు వంద శాతం నిర్వహించి తీరుతాము. కమిషన్ అంటే ఎస్సీ,ఎస్టీ వర్గాలకు కొండంత భరోసా..వారి అభ్యున్నతికై అహర్నిశలు కృషి చేస్తుంది అని తెలిపారు..

*దేశానికి దిక్సూచిగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్*-సెక్రటరీ కరుణాకర్

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ సెక్రటరీ కరుణాకర్ ఈ కార్యక్రమానికి స్వాగతోపన్యాసం చేశారు. సెక్రటరీ కరుణాకర్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రమేర్పడకముందు కమిషన్ హైదరాబాద్ లోని నాంపల్లి కార్యాలయానికి పరిమితమైంది.కానీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిషన్ కొత్త పుంతలు తొక్కింది.ఎస్సీ,ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపుతూ కమిషన్ దేశానికి ఆదర్శంగా నిలిచింది..హైదరాబాద్ లోని కార్యాలయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా గల్లీ గల్లీలో పర్యటించి ఎస్సీ,ఎస్టీల సమస్యలను పరిష్కరించి ఆయా వర్గాలకు అండగా నిలబడింది.పౌరహక్కుల దినాన్ని క్రమం తప్పకుండా నిర్వహించి దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు..

*ఎస్సీ,ఎస్టీ వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక కమిషన్* -కమిషన్ సభ్యులు

ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు రంబాలాల్ నాయక్,విద్యాసాగర్ లు మాట్లాడుతూ ” తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు కమిషన్ పనితీరు..తెలంగాణ రాష్ట్రమేర్పడిన తర్వాత కమిషన్ పనితీరు ఎలా ఉందో అందరికి తెలుసు.ఒకప్పుడు కమిషన్ అంటే హైదరాబాద్లోని కార్యాలయానికి,పేపర్లకి పరిమితమైంది కానీ రాష్ట్రంలో కమిషన్ ఏర్పాటైనాక ప్రతి ఊరు..ప్రతి గూడెం తిరుగుతూ క్షేత్రస్థాయిలో పర్యటించి ఎస్సీ,ఎస్టీ వర్గాల సమస్యలను,అట్రాసిటీ కేసులను పరిష్కరించి .బాధితులకు సుమారు నలబై కోట్లకుపైగా పరిహారాన్ని అందించి దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించిందని అన్నారు..

*ఏ రాష్ట్ర కమిషన్ కు లేని ఘనత తెలంగాణ రాష్ట్ర కమిషన్ కు సొంతం* -బుద్దవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఎం లక్ష్మయ్య

బుద్దవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మాట్లాడుతూ” నేను దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో పర్యటించాను.అక్కడ ఉన్న కమిషన్ల పనితీరుపై పరిశోధించాను.కానీ దేశంలో ఏ కమిషన్ చేయని తీరులో సీఎం కేసీఆర్ నాయకత్వంలో కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిషన్ ఎస్సీ,ఎస్టీల అభ్యున్నతికై కృషి చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపింది.దేశంలో ఎక్కడలేని విధంగా పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ దేశంలో ఏ రాష్ట్ర కమిషన్ కి దక్కని అరుదైన ఘనతను సొంతం చేసుకుందని తెలిపారు..

*దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్*-మంత్రి కొప్పుల ఈశ్వర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలో కమిషన్ పనితీరు దేశానికి ఆదర్శంగా నిలిచింది.రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించడమే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరువేల గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించడం దేశానికి ఆదర్శంగా నిలిచింది.రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారు ఎస్సీ,ఎస్టీలకు రెండు వందల గురుకులాలను ఏర్పాటు చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నట్లు ఎస్సీ,ఎస్టీ వర్గాల్లో అక్షరాస్యత పెంపొందించడంలో కమిషన్ చొరవ చూపించాలని సూచించారు.

*అన్నిటిలో దేశానికి ఆదర్శంగా నిలిచిన కమిషన్ అక్షరాస్యత సాధించడంలో కూడా ప్రముఖ పాత్ర పోషించాలి* -మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రమేర్పడిన తర్వాత కమిషన్ ఆరు వేలకుపైగా కేసులను పరిష్కరించి బాధితులకు నలబై కోట్లకుపైగా పరిహారం అందించడం గొప్ప విషయం. పౌరహక్కుల దినోత్సవం,డీవీఎల్ఎంసీ లాంటి పలు కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా ఆ కార్యక్రమాల యొక్క ఉద్ధేశ్యం నెరవేరేలా కమిషన్ పని చేయడం అభినందనీయం.. తెలంగాణ రాష్ట్రం అక్షరాస్యత సాధించడంలో కమిషన్ చొరవ చూపించాలని అన్నారు.. *దేశంలోని అన్ని కమిషన్ ల కంటే తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్సీ కమిషన్ మేటి*- సెంట్రల్ యూనివర్సిటీ ప్రొపెసర్ దేశంలోని ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులకు పరిష్కారం,అయా వర్గాలపై జీరో రేటు క్రైం విషయంలో తెలంగాణ ముందు ఉంది.దీనికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ ప్రముఖ పాత్ర పోషించందని ఆ సర్వే తేలిపిందన్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat