Home / ANDHRAPRADESH / సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సోమిరెడ్డి కౌంటర్..!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సోమిరెడ్డి కౌంటర్..!

జనసేన పార్టీ కీలకనేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. తన రాజీనామా లేఖలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరిగి సినిమాల్లో నటించడాన్ని లక్ష్మీనారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలలో నటించనని గతంలో పలుసార్లు చెప్పారు..ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది..అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లక్ష్మీనారాయణ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే లక్ష్మీనారాయణ తన సినిమాలపై చేసిన కామెంట్స్‌కు పవన్ కల్యాణ్ స్పందించారు. తనకు సిమెంటు ఫ్యాక్టరీలు..పవర్‌ ప్రాజెక్టులు.. గనులు.. పాల ఫ్యాక్టరీలు లాంటివి ఏవీ లేవని …అధిక వేతనం పొందే ప్రభుత్వ ఉద్యోగినీ కాదన్నారు. తనకు తెలిసిందల్లా సినిమా ఒక్కటేనని..తన మీద ఆధారపడి అనేక కుటుంబాలు జీవిస్తున్నాయన్నారు. వారి కోసం..తన కుటుంబం కోసం.. పార్టీకి ఆర్థిక పుష్టి కోసం నాకు సినిమాలు చేయడం తప్పనిసరి అంటూ పవన్ తేల్చి చెప్పారు. ఇవన్నీ లక్ష్మీనారాయణ తెలుసుకొని తన రాజీనామా లేఖలో ప్రస్తావించి ఉంటే బాగుండేదని అన్నారు. అయినా పార్టీకి రాజీనామా చేసిన లక్ష్మీనారాయణపై వ్యక్తిగతంగా తనకు.. జనసైనికులకు ఉన్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుందని.. ఆయనకు శుభాభినందనలు అంటూ పవన్ వ్యాఖ్యానించారు. కాగా పవన్ సినిమాలపై జేడీ చేసిన వ్యాఖ‌్యలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

 

తాజాగా పవన్ సినిమాలపై జేడీ చేసిన కామెంట్స్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పందించారు. లక్ష్మీ నారాయణ గారూ.. ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొన్ని సినిమాల్లో నటించడం చూశాం… పవన్ కల్యాణ్ ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికొచ్చిన నష్టమేం లేదు కానీ… రాజకీయ నాయకులు నిజ జీవితంలో నటిస్తేనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం.. అంటూ సోమిరెడ్డి ట్వీట్‌ చేశారు. పవన్ సినిమాలపై జేడీ లక్ష్మీనారాయణ చేసిన కామెంట్స్‌‌కు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి కౌంటర్ ఇవ్వడం సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్, చంద్రబాబుకు రహస్య మిత్రుడనేది అనేది బహిరంగ రహస్యమే. గత ఎన్నికల్లో కూడా పవన్ గెలవడం కోసమే తమ అభ్యర్థికి ప్రచారం చేయలేదని…చంద్రబాబు భీమవరంలో పార్టీ శ్రేణులతో చెప్పుకొచ్చాడు. పవన్ కూడా చంద్రబాబు, లోకేష్‌తో సహా మంత్రుల నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం చేయలేదు..అంతే కాదు ఓటు బ్యాంకు చీల్చేందుకు డమ్మీ అభ్యర్థులను చీల్చాడని, లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో బలమైన జనసేన అభ్యర్థిని కాదని…బలహీనమైన సీపీఐ అభ్యర్థికి సీటు ఇచ్చాడని విమర‌్శలు ఉన్నాయి. తాజాగా పవన్ బీజేపీతో పొత్తు వెనుక కూడా చంద్రబాబు వ్యూహం ఉందని…రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందుకే పవన్ సినిమాలు చేయడాన్ని టీడీపీ నేతలు సమర్థిస్తూ జేడీ లక్ష్మీనారాయణకు కౌంటర్ ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా పవన్ సినిమాలపై జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్‌కు టీడీపీ నేతలు కౌంటర్ ఇవ్వడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat