Home / ANDHRAPRADESH / అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై అజేయ కల్లం షాకింగ్ కామెంట్స్..!

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై అజేయ కల్లం షాకింగ్ కామెంట్స్..!

అమరావతిలో గత ఐదేళ్ల టీడీపీ హయాంలో రాజధాని పేరుతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో సహా, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి…4075 ఎకరాలు రైతుల దగ్గర నుంచి కొట్టేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేలాది కోట్లు గడించారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ మేరకు అసెంబ్లీలో సాక్షాత్తు సీఎం జగన్ అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. అలాగే రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన చంద్రబాబు, టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లను, వారు బినామీల పేరుతో కొనుగోలు చేసిన భూముల వివరాలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వివరించారు. అయితే తాజాగా చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వికేంద్రీకరణ సభకు హాజరైన ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

అజేయకల్లం మాట్లాడుతూ…తన చాతుర్యం ప్రదర్శించి ఎదుటి వారిపై బురద చల్లడంలో, చరిత్రను వక్రీకరించటంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటీ, రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను అమలు చేయలేదు సరికదా కనీస చర్చకు కూడా ఆహ్వానించలేదని ధ్వజమెత్తారు..అన్ని కమిటీలూ పాలనా వికేంద్రీకరణ చేయాలని సూచించాయని ఆయన అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వాసులు నీటి కోసం, కూటి కోసం అల్లాడుతుంటే.. అమరావతిలో రేట్లు.. రూ.కోట్ల కోసం ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందని ఫైర్ అయ్యారు. అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ సీఎం జగన్ లక్ష్యమన్న ఆయన అభివృద్ధి అంతా ఒకేచోట ఉండాలన్న చంద్రబాబు, టీడీపీనేతల వాదన కరెక్ట్ కాదని తేల్చి చెప్పారు. మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్న ఆలోచనతోనే వికేంద్రీకరణకు ప్రభుత్వం ముందడుగు వేస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకరించడం వల్ల…తెలంగాణ రాయలసీమ వెనుకబడి ఉన్నాయని, కృష్ణా గుంటూరు లు రాజధాని ఏర్పాటుకు అనుకూలం కాదని నాడు శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని అజేయకల్లం గుర్తు చేశారు.

 

ఇక రాజధాని అమరావతిలో పెద్దఎత్తున ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని… ఆ భూములన్నీ రైతుల చేతుల్లో కన్నా పెద్దపెద్దవాళ్లు, రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లి పోయాయని..ఆరోపించారు. ఆఖరకు సుప్రీంకోర్టు జడ్జిలు అడ్వొకేట్ జనరల్స్ కొంతమంది పత్రికాధి పతుల చేతుల్లో ఈ బినామీ భూములు ఉన్నాయంటూ అజేయకల్లం సంచలన ఆరోపణలు చేశారు. కాగా వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు కంటే మించిన నాయకుడు దేశంలోనే లేడు. మీడియానే కాదు..న్యాయవ్యవస్థను మేనేజ్ చేయడంలో కూడా చంద్రబాబు దిట్ట.. అందుకే తనపై నమోదైన 18 కేసుల్లో సుప్రీంకోర్డు నుంచి స్టేలు తెచ్చుకున్న ఘనుడు చంద్రబాబు…ఇప్పుడు అమరావతిలో జరిగిన బినామీ భూబాగోతంలో జడ్జీలు, అడ్వకేట్ జనరల్స్ ఉన్నారంటూ..అజేయ కల్లం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు ఎంతగా వారిని మేనేజ్ చేశాడో అర్థమవుతుంది. మొత్తంగా అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై అజేయకల్లం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలో కలకలం రేపుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat