Home / ANDHRAPRADESH / పసుపునీళ్లతో “పచ్చ” రాజకీయం… ఇట్స్ వెరీ దారుణం..తమ్ముళ్లు..!

పసుపునీళ్లతో “పచ్చ” రాజకీయం… ఇట్స్ వెరీ దారుణం..తమ్ముళ్లు..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు, తెలుగు తమ్ముళ్లకు ఉన్న అతి అంతా ఇంతా కాదు..తాము ఏదో సచ్చీలురు అయినట్లు, మహా నీతివంతులైనట్లు బిల్డప్ ఇచ్చుకుంటారు.. ..ఎదుటోళ్లు దుర్మార్గులు, పాపాత్ములు అంటూ బురదజల్లుతుంటారు. తాము తప్పులు చేస్తూ…ఆ తప్పులు ఎదుటోళ్లు చేస్తున్నారంటూ బుకాయించడంలో చంద్రబాబు తర్వాత ఎవరైనా…గత ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడు లక్ష కోట్ల దొంగ, 11 సీబీఐ కేసులు, అంటూ నోరుపారేసుకున్న తెలుగు తమ్ముళ్లు..అదే తమ నాయకుడు చంద్రబాబు మావాళ్లు బ్రీఫ్డ్‌మీ అంటూ తెలంగాణలో ఎమ్మెల్సీని కొనుగోలు చేస్తూ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి…పదేళ్ల రాజధాని హక్కును వదులుకుని మరీ..అర్థరాత్రి దొంగలాగా బెజవాడకు పారిపోయి వచ్చిన విషయం గురించి మాత్రం మాట్లాడరు.. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబుపై నమోదైన 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్న విషయం గురించి మాట్లాడరు..కాని చంద్రబాబు అనుకులమీడియా, లోకేష్‌ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా వింగ్..టీడీపీ నేతలు..ఇలా ప్రతి ఒక్కరూ జగన్‌ నడిస్తే…ఆ ప్రాంతం అపవిత్రం అయిపోయినట్లుగా వీరంగం వేసేవారు..ఎంత దారుణమంటే…టీడీపీ నేతలకు కుల పిచ్చే కాదు…ఎదుటోళ్లను కించపరుస్తూ…శాడిస్టిక్ ఆనందం పొందడం అలవాటు.

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షనాయకుడు జగన్ పాదయాత్ర చేస్తుండగా చంద్రబాబుతో సహా టీడీపీ నేతల ఓవరాక్షన్‌‌కు అంతే ఉండేది కాదు…పాదయాత్రలో భాగంగా జగన్.. ఊరూరా తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ వెళ్లేవారు.. అలా ఏదైనా ఊరిలో జగన్ పాదయాత్ర అయిపోగానే చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ శ్రేణులు రంగంలోకి దిగేవారు..జగన్ నడిచిన రోడ్లు ఏవో అపవిత్రం అయిపోయినట్లు పసుపునీళ్లతో శుద్ధి చేసి తమ కుచ్సిత బుద్ధిని బయటపెట్టుకునేవారు. తెలుగు తమ్ముళ్ల పసుపు నీళ్ల శుద్ధి కార్యక్రమాలను చంద్రబాబు అనుకుల మీడియా ఛానళ్లు పెద్ద ఎత్తున ప్రసారం చేస్తూ…శాడిస్టిక్ ఆనందాన్ని పొందేవి. ఇలాంటి పసుపు నీళ్ల శుద్ధి కార్యక్రమాలు అప్పట్లో చాలానే జరిగేవి..అయితే పసుపునీళ్లతో కడిగి కడిగి… చివరకు తమ పసుపు పార్టీనే కంప్లీట్‌గా శుద్ధి చేసుకున్నా…తెలుగు తమ్ముళ్లకు బుద్ధి రావడం లేదు.

 

తాజాగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు సొంత ఊరు అయిన నారావారి పల్లెలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వికేంద్రీకరణకు అనుకూలంగా భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఏపీకి మూడు రాజధానులు ఎందుకు అవసరమో ప్రజలకు వైసీపీ నేతలు వివరించారు. అయితే ఈ సభకు సీఎం జగన్ హాజరు కాకపోయినా ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. తన సొంతూరిలో వైసీపీ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో చంద్రబాబుతో పాటు అనుకుల మీడియా రగలిపోయింది…ఇంకేముంది పసుపునీళ్లతో పచ్చ రాజకీయం మళ్లీ మొదలైంది.. తెలుగు తమ్ముళ్లు రంగంలోకి దిగారు…పసుపు నీళ్లతో వైసీపీ సభ జరిగిన సభా ప్రాంగణాన్ని శుద్ధి చేశారు…పసుపు మీడియా ఈ శుద్ధి కార్యక్రమాన్ని కవరేజీ చేసి…జగన్‌‌ను కించపరుస్తూ తమనోటి దూల తీర్చుకుంది. అయినా ఓ ప్రభుత్వానికి ఓ ఏడాది సమయం ఇచ్చి మూడు రాజధానుల ప్రయోగం విఫలం అయితే అప్పుడు నిలదీస్తే..బాగుంటుంది కాని..ఇలా పసుపు నీళ్లతో శుద్ధి చేయడం ఏంటీ..అధికారంలోకి రాకముందు ఎక్కడ చంద్రబాబు మళ్లీ సీఎం కాడో అని జగన్‌పై పదే పదే అక్కసు వెళ్లగక్కారు..ఇప్పుడు జగన్ సీఎం అయిన తర్వాత కూడా తమను అధికారం నుంచి దూరం చేశాడనే అక్కసుతో ఇలాంటి ఛండాలపు పనులు చేస్తున్నారు. .అయ్యా బాబుగారు… రాజకీయాలన్నాకా ఐదేళ్లు మీరు అధికారంలోకి ఉంటే..ఇంకో ఐదేళ్లు వాళ్లకు అవకాశం వస్తుంది…అంతే కాని ముందు మీలో జగన్‌ పట్ల జీర్ణించుకుపోయిన ద్వేషాన్ని, అక్కసును శుద్ధి చేసుకుంటే మంచిది… .ఇలా పసుపు నీళ్లతో శుద్ధి చేసి చేసి ప్రజలతో మీ పార్టీని పూర్తిగా శుద్ధి చేసే పరిస్థితి తెచ్చుకోకండి…మీ తెలుగుతమ్ముళ్లకు కూడా చెప్పండి…జగన్ పాదయాత్ర చేశాడని అమరావతిలో పసుపునీళ్లతో కడిగి పచ్చడై పోయారు..అయినా సిగ్గురాకపోతే ఎలా తమ్ముళ్లు…ఇకనైనా పసుపు నీళ్ల శుద్ధి కార్యక్రమాలను ఆపేసి హుందాగా వ్యవహరించండి..అయినా బాబుగారికి ఎంత చెప్పినా వేస్ట్..యథానాయకుడు..తథా తమ్ముళ్లు…వీళ్ల పచ్చరాజకీయం మారదు..అంతేగా..అంతేగా..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat