అంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంచలన కామెంట్స్ చేసారు. ఆయనకు ఆరోగ్యం అంతా బాగుంటే మరో 20 ఏళ్ళు కచ్చితంగా జీవిస్తానని. ఆ విషయం కోసం నేను ఎన్నడూ ఆలోచించలేదని, నా భాద అంతా రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని అన్నారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తొమ్మిది నెలలలోనే రాష్ట్రానికి ఆర్ధిక పతనం మొదలయిందని ఎద్దేవా చేసారు. అయితే దీనిపై కొందరు ఆయనకు ఏంటీగా కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. తొమ్మిది నెలలు గురించి ఇంతలా మాట్లాడితే మరి 5ఏళ్ల పాలనలో ప్రజలు ఇంకెంత మండిపడాలి అని అంటున్నారు.