Home / ANDHRAPRADESH / మొన్న జేసీకి, నేడు వర్ల రామయ్యకు మీసం తిప్పి సవాలు విసురుతున్న పోలీసులు..!

మొన్న జేసీకి, నేడు వర్ల రామయ్యకు మీసం తిప్పి సవాలు విసురుతున్న పోలీసులు..!

ఏపీ పోలీసులపై టీడీపీ నేతలు నోరుపారేసుకుంటున్నారు. గత ఐదేళ్లలో పోలీసులను ఇష్టానుసారంగా వాడుకున్న టీడీపీ నేతలు..ఇప్పుడు అదే పోలీసులు తమకు చుక్కలు చూపిస్తుండడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి నాడు సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ మీసం తిప్పి..సవాలు విసిరారు..అదే గోరంట్ల మాధవ్ వైసీపీ తరపున హిందూపురం ఎంపీగా గెలిచి సంచలనం సృష్టించారు. కాగా ఇటీవల టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులతో మా బూట్లు నాకిస్తా…మళ్లీ అధికారంలోకి రాగానే గంజాయి కేసులు పెట్టి బొక్కలు తోయిస్తా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మరోసారి గోరంట్ల మాధవ్ పోలీసు బూట్లను ముద్దాడి జేసీ నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.

 

ఇప్పుడు మరో టీడీపీ నేత వర్ల రామయ్య పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసుల జాతకాలు నా దగ్గర ఉన్నాయంటూ..వారి సంగతి తేలుస్తామంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వర్ల రామయ్య వ్యాఖ్యలపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. తాజాగా ఏపీ పోలీస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనుకుల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ వర్ల రామయ్యపై విరుచుకుపడ్డారు. గతంలో పోలీస్‌ అధికారిగా పని చేసిన టీడీపీ నేత వర్ల రామయ్యకు పోలీసుల గురించి నీచంగా మాట్లాడడానికి సిగ్గులేదా అని శ్రీనివాస్‌రావు మండిపడ్డారు. పోలీసు అధికారుల సంఘంపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న రామయ్య.. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని ఫైర్ అయ్యారు.. పోలీసులను కించపరిచేలా మాట్లాడటం ఫ్యాషన్‌ అయిపోయిందని శ్రీనివాస్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి పోలీసులపై అసత్య ప్రచారం చేస్తున్నారని, పోలీసు వ్యవస్థ ఎవరికీ తలొగ్గదని, అనవసరంగా పార్టీ రంగు పులమొద్దని వర్లరామయ్యను హెచ్చరించారు.

 

ఇకనుంచి పోలీసులపై అసత్య ప్రచారం చేసినా, దూషించినా.. న్యాయ పోరాటం చేస్తామని, వారు ఎంత పెద్దవారైనా సహించేది లేదని.. స్పష్టం చేశారు. పోలీసుల జాతకాలు నీ వద్ద ఉన్నాయని మాట్లాడుతున్నావ్‌.. నీ జాతకం మొత్తం నా దగ్గర ఉంది ఖబర్దార్‌ అంటూ శ్రీనివాస్‌రావు తీవ్రంగా స్పందించారు. మొన్న మొన్నటివరకు ఆర్టీసీ చైర్మన్‌గా పని చేసిన వర్ల రామయ్య పోలీసులకు కనీసం ఒక బస్‌పాస్‌ కూడా ఇప్పించలేకపోయారని ధ్వజమెత్తారు. గతంలో పోలీసు అధికారిగా ఉన్నపుడు వర్లపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని తీవ్ర విమర్శలు చేశారు. మొత్తంగా వర్ల రామయ్యకు, ఏపీ పోలీసు అధికారుల సంఘంకు మధ్య వివాదం ముదురుతుంది. మరి ఈ వివాదం మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat