Home / SLIDER / ఎంపీ అర్వింద్ రాజీనామా చేయాలి

ఎంపీ అర్వింద్ రాజీనామా చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన పదవీకి రాజీనామా చేయాలని నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా నిరసనలు ,ధర్నాలు జరుగుతున్నాయి. జిల్లాకి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన జిల్లా రైతుల చిరకాల కోరిక పసుపు బోర్డును తీసుకురాని ఎంపీ అర్వింద్ తన పదవీకి రాజీనామా చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

నిన్న బుధవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ”ఎంపీగా గెలిపిస్తే పసుపుబోర్డు వస్తుంది అని హామీస్తేనే ధర్మపురి అర్వింద్ ను ప్రజలు గెలిపించారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు పసుపు బోర్డు వచ్చిందంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పసుపుబోర్డుకు బదులు సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు అని ఆయన అన్నారు. పసుపు బోర్డును తీసుకురాని అర్వింద్ తన పదవీకి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.