Home / ANDHRAPRADESH / చంద్రబాబు మాజీ పీఎస్‌పై ఐటీదాడులు… కీలక సమాచారం లభ్యం..టీడీపీలో ఆందోళన..!

చంద్రబాబు మాజీ పీఎస్‌పై ఐటీదాడులు… కీలక సమాచారం లభ్యం..టీడీపీలో ఆందోళన..!

ఒకవైపు అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఈడీ, సీఐడీ విచారణలు…మరోవైపు ఐటీ దాడులతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాసరావుకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై రెండు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడులు టీడీపీ నేతలను కలవరానికి గురి చేస్తున్నాయి. ఫిబ్రవరి 6 తేదీ గురువారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు శ్రీనివాసరావుకు చెందిన హైదరాబాద్ చంపాపేట, విజయవాడ గాయత్రీనగర్ కంచుకోట అపార్ట్‌మెంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు అర్ధరాత్రి వేళ రూ.150 కోట్ల నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా శ్రీనివాసరావు 2019 ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడు పీఎస్‌గా పనిచేశారు…ప్రస్తుతం జీఏడీలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే గత ఐదేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబు పీయస్‌గా వ్యవహరించిన శ్రీనివాసరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన శ్రీనివాసరావు ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తే ప్రతికూలత ఎదురవుతుందనే ఉద్దేశంతో ఐటీ అధికారులు ఢిల్లీ నుంచి సీఆర్పీఎఫ్ సిబ్బందిని తమ వెంట తీసుకొచ్చారు.

 

కాగా చంద్రబాబు హయాంలో కాంట్రాక్ట్ పనులను కేటాయించడంలో శ్రీనివాసరావు కీలక పాత్ర వహించినట్లు తెలుస్తోంది. గుత్తేదారులకు పనులు కేటాయించి, వారి దగ్గర కమీషన్లు కొట్టేసి మరీ.. పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టారని ఐటీ అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కమీషన్ల బాగోతంలో టీడీపీ పెద్దలకు కూడా వాటాలు వెళ్లినట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ వాటాల బాగోతంపై కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. మరోవైపు శ్రీనివాసరావుతోపాటు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇలా వరుసగా చంద్రబాబు సన్నిహితుల ఇళ్లలో ఐటీ దాడుల నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు తమ్ముళ్లు ఆందోళనకు గురవుతున్నారు. . కాగా చంద్రబాబు మాజీ పీఎస్‌గా ఉన్న ఈ శ్రీనివాస్‌రావు ఎవరో కాదు..హెరిటేజ్ ఫుడ్స్‌‌కు తొలుత ఎండీగా, తర్వాత ప్రెసిడెంట్‌గా వ్యవహరించిన సాంబశివరావు చౌదరి మేనల్లుడే ఈ శ్రీనివాస్‌రావు అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ..చూశారుగా…చంద్రబాబుకు, మాజీ పీయస్‌ శ్రీనివాస్‌రావుకు ఉన్న అనుబంధం..గత ఐదేళ్లు ఏ స్థాయిలో కమీషన్ల దందా నడిచిందో మీరే అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఈడీ కేసులు నమోదు చేస్తుండడం, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులపై ఐటీ దాడులు జరుగుతుండడంతో మున్ముందు ఏం జరుగుతుందోన్న టెన్షన్ టీడీపీలో నెలకొంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat