కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఇటీవల నియామకమైన ఐఎఎస్ డా.శరత్ శనివారం మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర రోడ్లు,భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి నూతన కలెక్టర్ శరత్ ను అభినందించారు.ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు,కొత్త స్కీమ్ లు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కృషి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలెక్టర్ కు సూచించారు.