Home / ANDHRAPRADESH / ఏబీవీ సస్పెన్షన్ వ్యవహారంలో బయటపడుతున్న దిగ్బ్రాంతికర వాస్తవాలు..!

ఏబీవీ సస్పెన్షన్ వ్యవహారంలో బయటపడుతున్న దిగ్బ్రాంతికర వాస్తవాలు..!

ఏపీ మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీవీ వెంకటేశ్వరావు సస్సెన్షన్ వ్యవహారంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతుంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేయడంపై గగ్గోలు పెడుతుంది. టీడీపీ హయాంలో చంద్రబాబు ఏరికోరి తన సామాజికవర్గానికే చెందిన ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించుకున్నాడు. చంద్రబాబు అండతో ఏబీవీ వెంకటేశ్వరావు చెలరేగిపోయారు. గత ఐదేళ్లు ఏబీవీ అవినీతిదందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. 23 మంది వైసీపీ నేతలపై నిఘాపెట్టించి..భయపెట్టి..ప్రలోభపెట్టి వారిని టీడీపీలో చేర్పించడంలో చంద్రబాబుకు ఏబీవీ సహకరించాడని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.

 

ఇక 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అప్పటి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల ఫోన్‌ కాల్స్‌ను ట్యాపింగ్‌ చేయడానికి చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు 2017 లోనే ఓ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ అనుమతి లేకుండానే ఇజ్రాయెల్‌ నుంచి క్రిటికల్‌ ఇంటెలిజెన్స్, సర్వైలన్స్‌ పరికరాలను ఏబీవీ కొనుగోలు చేయించారు. దాంతో దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన ఇంటెలిజెన్స్‌ ప్రొటోకాల్, ప్రోసీజర్స్‌ను విదేశీ కంపెనీలకు లీక్‌ చేసినట్టయ్యిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాల కొనుగోలు కాంట్రాక్టును ఏబీవీ తన కుమారుడు చేతన్‌ సాయి కృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్డ్స్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’అనే కంపెనీకి కట్టబెట్టారు. ఇందుకోసం విజయవాడ క్రీస్తురాజపురం ఫిల్మ్‌కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ అడ్రస్‌తో  ఓ షెల్  కంపెనీని నెలకొల్పారు.  ఇక ఈ కంపెనీ పేరిట కాంట్రాక్టు కట్టబెట్టడంలోనూ కేంద్ర నిబంధనలను ఉల్లంఘించారు. కాగా ఈ కాంట్రాక్టుకు ఉద్దేశించిన ‘పర్చేజ్‌ ఆర్డర్‌’ను రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం నుంచి ఉద్దేశ పూర్వకంగా మాయం చేయడం విస్మయపరుస్తోంది. దీంతో ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేయడం సమంజసమేనని కేంద్ర హోం శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక చంద్రబాబు అండతో ఏబీవీ యథేచ్ఛగా అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. గత ఐదేళ్ల టీడీపీ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు బినామీల పేరిట తెలంగాణలో 171.39 ఎకరాలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. నారాయణ్‌పేట్‌ జిల్లా మక్తల్‌ మండలం పస్పూల్‌ గ్రామంలో 57.19 ఎకరాలు, చిట్యాలలో 64.20 ఎకరాలు బినామీల పేరిట కొనుగోలు చేశారు. వీటికి రైతు బంధు కింద గత ఖరీఫ్‌లో దాదాపు రూ.55 లక్షల ఆదాయం ఆర్జించినట్టు సమాచారం. అలాగే జడ్చెర్ల వద్ద 50 ఎకరాలు బినామీల పేరుతో కొనుగోలు చేసి అందులో ఓ అధునాత గెస్ట్‌ హౌస్‌ను నిర్మించారని ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. ఇలా చంద్రబాబు అండతో ఏబీవీ అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.

 

కేవలం ఒక్క వైసీపీ నేతల ఫోన్ ట్యాపింగ్‌లే కాదు..చంద్రబాబును వ్యతిరేకించే కొందరు టీడీపీ కీలక నేతల ఫోన్లను కూడా ఏబీవీ ట్యాపింగ్ చేయించిన వ్యవహారం బయటపడుతోంది. తమపై నిరంతరం నిఘా పెట్టించి, తమ కదలికలను చంద్రబాబుకు ఎప్పటికప్పుడు చేరవేసేవారని టీడీపీ నేతలు కొందరు ఆరోపిస్తున్నారు. ఏబీవీ సస్పెన్షన్‌పై కొందరు టీడీపీ నేతలు లోలోపల సంతోషిస్తున్నారనడాని నిదర్శనమే..కేశినేని నాని ట్వీట్. కేవలం కులాభిమానంతో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకోసం ఆఖరకు దేశ భద్రతా రహస్యాలను పణంగా పెట్టిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. మొత్తంగా ఐబీవీ సస్పెన్షన్ నేపథ్యంలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తుండడంతో రాజకీయ, అధికార వర్గాలు నివ్వెరపోతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat