Home / ANDHRAPRADESH / ఏబీవీపై వైసీపీ ఎమెల్యే మల్లాది విష్ణు సంచలన ఆరోపణలు…!

ఏబీవీపై వైసీపీ ఎమెల్యే మల్లాది విష్ణు సంచలన ఆరోపణలు…!

ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావుపై పలు ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఆయన ఓ అధికారిగా కాకుండా టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడని  అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. నాడు నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ఏబీవీ దాదాపు 200 కోట్లు ప్రభుత్వ వాహనాల్లో తరలించాడని వైసీపీ నేతలు ఆరోపించారు. కాగా మీరు ముఖ్యమంత్రి అవడానికి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్‌ చేశారేంటి జగన్‌మోహన్‌రెడ్డి గారూ అంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్‌కు ఏబీవీ సమాధానం ఇస్తూ..ఏమిటోనండీ ఎంపీ గారూ.. మీరేమో ఇలా అంటారు.. మరి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి నేనే కారణమని అంబటి రాంబాబు గారు అప్పట్లో కడుపుబ్బా నవ్వించారు’ అంటూ…ఆయనపై వచ్చిన ఆరోపణలను ఏబీవీ స్వయంగా బయటపెట్టుకున్నారు.

ఇక అప్పట్లో చంద్రబాబు ఆదేశాల మేరకు  నిఘా పరికరాలను కొన్న ఏబీవీ వైసీపీతో పాటు టీడీపీ సీనియర్ నేతలు, మంత్రుల కదలికలను గమనించేందుకు వాటిని వాడుకున్నారనే విమర్శలూ వచ్చాయి. అలాగే ఏబీవీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు తమలాంటి సీనియర్ నేతలను పక్కనపెట్టడంపై కేశినేని నాని లాంటి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే ఏబీవీ సస్పెన్షన్‌పై కేశినేని నాని సెటైరికల్ ట్వీట్ చేయడమే కాకుండా… అవినీతి అధికారులను వెనకేసుకురావడమే పార్టీ విధానమా అంటూ.. చంద్రబాబు తీరును ట్విట్టర్ వేదికగా ఎండగడుతున్నారు. అదే సమయంలో తమ పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్పింపచడంలో చంద్రబాబుకు ఏబీవీ సహకరించారని…వైసీపీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

అయితే తాజాగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏబీవీపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీవీ వైసీపీకి చెందిన చాలా మంది నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారని మల్లాది విష్ణు ఆరోపించారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామని ఆయన తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీ గెలకుండా చంద్రబాబు కుట్ర చేస్తే.. దానిని అమలు చేసే బాధ్యతలను ఏబీవీ తన భుజానికెత్తుకున్నారంటూ మండిపడ్డారు. సో…ఇంటెలిజెన్స్ చీఫ్‌గా చంద్రబాబు అండతో చెలరేగిపోయిన ఏబీవీ దేశ భద్రత రహస్యాలను విదేశీ కంపెనీలకు చేరవేశాడనే నేరంతో పాటు, నిబంధనలకు వ్యతిరేకంగా నిఘా పరికరాలు కొనుగోలు చేయడం , బినామీల పేరుతో భూబాగోతాలు, వైసీపీ నేతల ఫోన్ ట్యాపింగ్‌‌..ఇలా వరుస కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది…దీంతో ఏబీవీని అడ్డుపెట్టుకుని చంద్రబాబు చేసిన కుట్రలన్నీ త్వరలోనే బయటపడతాయని ఏపీ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏబీవీపై వస్తున్న ఆరోపణలు చివరకు చంద్రబాబు మెడకు చుట్టుకునేలా ఉన్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat