Home / MOVIES / ఈ టిక్‌టాక్‌ వీడియో నా హృదయాన్ని తాకిందంటూ ట్విటర్‌లో పెట్టిన అల్లు అర్జున్‌

ఈ టిక్‌టాక్‌ వీడియో నా హృదయాన్ని తాకిందంటూ ట్విటర్‌లో పెట్టిన అల్లు అర్జున్‌

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ దాకా ఎక్కడ చూసినా ‘బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా’ అంటూ ఊగిపోతున్నారు జనాలు. సామాన్యులతోపాటు సెలబ్రిటీలు సైతం పాటకు తగ్గట్టుగా స్టెప్పులేస్తూ ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టిక్‌టాక్‌లోనూ ఈ పాట మారుమోగిపోతోంది. బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్‌ చేస్తూ వీడియోలకు లైకులు సంపాదించుకుంటున్నారు. తాజాగా ఓ టిక్‌టాక్‌ వీడియో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కంట పడింది. దీనికి ఎంతగానో ముగ్ధుడైపోయిన బన్నీ.. ఇది నా హృదయాన్ని తాకిందంటూ ఆ వీడియోను ట్విటర్‌లో పంచుకున్నాడు.

ఇంతకీ ఈ వీడియోలో ఆడిపాడుతోంది ఇద్దరు దివ్యాంగులు. కాళ్లు లేని వ్యక్తి బుట్టబొమ్మ అంటూ డ్యాన్స్‌ చేయగా దానికి చేతులు లేని యువతి డ్యుయెట్‌ చేసింది. దీనిపై బన్నీ స్పందిస్తూ ‘హార్ట్‌ టచింగ్‌ వీడియో. సంగీతం మనిషి వైకల్యాన్ని మర్చిపోయేలా చేస్తుందని ఈ వీడియో నిరూపించింది’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat