Home / HYDERBAAD / హైదరాబాద్ మెట్రో ఆల్ టైమ్ రికార్డు

హైదరాబాద్ మెట్రో ఆల్ టైమ్ రికార్డు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌ మెట్రోరైలు ఆల్‌టైమ్‌ రికార్డును నమోదుచేసింది. మొన్న సోమవారం మూడు కారిడార్లలో కలిపి మొత్తం 4,47,009 మంది మెట్రోరైళ్లలో ప్రయాణించినట్టు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

సాధారణ రోజులను పరిగణనలోకి తీసుకొంటే ఇదే అతిపెద్ద రికార్డని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2019 డిసెంబర్‌ 31 ఉదయం నుంచి 2020 జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 2 గంటల వరకు 4.60 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైలులో రాకపోకలు సాగించిన్నప్పటికీ సాధారణ రోజుల్లో ఈ సంఖ్య 4.47లక్షలకు చేరుకోవడం ఇదే మొదటిసారి.

మెట్రోలో రోజుకు సగటున 4.10 నుంచి 4.20 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. గత రెండేండ్లలో మెట్రోలో ప్రయాణించినవారి సంఖ్య ఇప్పటికే పది కోట్లు దాటింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat