అంతర్జాతీయ మార్కెట్లో బంగారు ధరలు క్షీణించాయి. అయితే మరో వైపు వెండి ధరలు పెరిగాయి. బంగారం ఔన్స్ కు ధర 0.08%కి పడింది. అదే వెండి ధర ఔన్స్ కు 0.33% పెరిగింది.
హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. వంద తగ్గి మూతం రూ.39,250ల నుండి 39,150కి తగ్గింది. మరోవైపు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.140తగ్గి రూ.42,640కి చేరింది.
వెండి కేజీకి రూ.50పెరిగి రూ.49,550కి చేరింది.