Home / ANDHRAPRADESH / సీఎం జగన్‌కు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!

సీఎం జగన్‌కు భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీఫెన్ రవీంద్రను ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా తెచ్చుకునేందుకు సీఎం జగన్ ప్రయత్నించారు. అయితే అప్పుడు జగన్ సర్కార్ విజ్ఞప్తిని పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర నియమించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి స్టీఫెన్ ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. రాయలసీమలోనూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. 1990 బ్యాచ్‌కు చెందిన రవీంద్ర సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. గతేడాది తెలంగాణలో చోటు చేసుకున్న ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌కు కూడా స్టీఫెన్ రవీంద్రనే ఇంఛార్జి‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. గతంలోనే జగన్ ని కలిసిన స్టీఫెన్ ఏపీలోని పరిస్థితులపై పూర్తి అవగాహనతో ఉన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat