ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి అత్యాచారం కేసును సీబీఐకి అప్పగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్ది హామీచ్చారు.
కర్నూలు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిసిన సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ప్రీతికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. కేసును సీబీఐకు అప్పగిస్తాము. ప్రీతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాము అని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు.