Home / ANDHRAPRADESH / బ్రేకింగ్…కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటించిన నారా లోకేష్…!

బ్రేకింగ్…కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటించిన నారా లోకేష్…!

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్ల మేర అక్రమలావాదేవీలు జరిగాయని, హవాలా, మనీలాండరింగ్ ద్వారా వేల కోట్ల అవినీతి జరిగిందని ఐటీ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో అమరావతి నుంచి హవాలా ద్వారా 400 కోట్ల అక్రమ సొమ్ము కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్‌పటేల్‌కు ఖాతాకు చేరాయని , వీటిపై సమాధానం చెప్పాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. ఈ హవాలా, మనీలాండరింగ్ స్కామ్‌లో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ పాత్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఆస్తుల వివరాలను ప్రకటించారు. ప్రతీ ఏడాది ప్రకటించినట్లుగానే మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తమ కుటుంబ ఆస్తులను మీడియాకు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఆస్తి 9 కోట్ల రూపాయలని, అప్పులు 5.13 కోట్లు అని, గత ఏడాది కంటే ఈ ఏడాది మా నాన్నగారి ఆస్తి 87 లక్షల రూపాయలు పెరిగినట్లు లోకేష్ చెప్పుకొచ్చారు. ఇక తన తల్లి  నారా భువనేశ్వరికి 50 కోట్ల రూపాయల ఆస్తి ఉందని.. గతంలో కంటే ఆమె ఆస్తులు తగ్గిపోయాయని లోకేష్‌ తెలిపారు. తనకు 8.14 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని, తన పేరిట ఉన్న షేర్లను భార్య బ్రాహ్మణికి బహుమతిగా ఇచ్చానని ప్రకటించారు.. గతంలో కంటే తన ఆస్తి 2.40 కోట్ల రూపాయల మేర తగ్గిపోయిందని చెప్పుకొచ్చారు. బ్రాహ్మణికి 15.68 కోట్ల రూపాయలు, తన కుమారుడి దేవాన్ష్‌ కు 19.42 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు చెప్పారు.

ఇక అమరావతిలో హెరిటేజ్ సంస్థ తరపున భూములు కొన్నామని వస్తున్న ఆరోపణలు నిజం కాదని..2014 మార్చిలో రాజధాని పరిధికి 30 కిలోమీటర్ల దూరంలో హెరిటేజ్ కోసం భూములు కొన్నామని అంతేకాని…అమరావతిలోని 29 గ్రామాల్లో తన కుటుంబానికి ఒక్క గజం భూమి కూడా లేదని లోకేష్ చెప్పుకొచ్చారు. గత తొమ్మిదేళ్లుగా ఆస్తులను ప్రకటిస్తూ సవాల్ విసురుతున్నా ఎవరూ స్వీకరించడం లేదని లోకేష్ బిల్డప్ ఇచ్చారు. అయితే నారా ఫ్యామిలీ ఆస్తుల ప్రకటన ప్రతిసారిలాగానే ఈ సారి కూడా కామెడీని పండించాయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు 9 కోట్లా…మనవడి ఆస్తి 19 కోట్లా…నీ ఆస్తి 8 కోట్లా..నీ భార్య ఆస్తి 15 కోట్లా…ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నావు…లోకేషూ అంటూ సోషల్ మీడియాలో తెగ సెటైర్లు పడుతున్నాయి. మీరు మీ హెరిటేజ్ పాలలాగా స్వచ్ఛమైనవారు బాబు..పాలు, మజ్జిగ, కూరగాయలు అమ్ముకుంటూ తెగ కష్టపడిపోతున్నారు..అయినా మీ ఆస్తులు మాత్రం పెరగవు..అవునేలా..అన్నీ బినామీల పేరుతో ఉంటాయిగా..ఎలా పెరుగుతాయిలే అంటూ…కామెంట్లు వస్తున్నాయి..ఇంకా నయం.. మీ నాన్నారి ఆస్తి 87 లక్షలు పెరిగిందని చెప్పావు..నిజం చెప్పు పెరిగింది 87 లక్షలా…87 వేల కోట్లా అంటూ నెట్‌జన్లు లోకేష్‌ను ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా నారాలోకేష్ గారి ఆస్తుల ప్రకటన కామెడీ ప్రహసనాన్ని తలపించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat