Breaking News
Home / Uncategorized / తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మారిన టీడీపీ అధ్యక్షుడు..!

తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మారిన టీడీపీ అధ్యక్షుడు..!

ఏపీలో దశలవారీగా మద్యనిషేదం అమలు చేస్తానని పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ ముందడుగు వేస్తున్నారు. బెల్ట్ షాపులను రద్దు చేసి, ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు.అంతే కాదు మద్యం రేట్లు భారీగా పెంచారు. మద్యం అమ్మే సమయాలను కూడా కుదించారు. మద్యం రేట్లు భారీగా పెరగడంతో కొందరు మద్యం ప్రియులు క్రమంగా తాగుడు అలవాటును మానుకుంటున్నారు. రెగ్యులర్‌గా ఫుల్‌బాటిల్ ఎత్తనిదే నిద్రపట్టని మందుబాబులు కూడా మితంగా తాగుతున్నారు. దీంతో ఏపీలో క్రమంగా మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయి.సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు హ‍ర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం..తాగుబోతు సంఘం అధ్యక్షుడిలా మందుబాబులను వెనకేసువస్తున్నారు. తాజాగా ప్రజా చైతన్యయాత్రలు మొదలుపెట్టిన చంద్రబాబు..మందుబాబులను వెనకేసువస్తూ మద్యం రేట్లు పెరిగాయంటూ…ప్రభుత్వంపై తెగ రెచ్చిపోయారు.. బాబుగారికి మద్యం అలవాటు లేదు కాని…ఫుల్ బాటిల్ తాగినవాడిలా ప్రభుత్వంపై చిందులు వేసాడు. ఏం తమ్ముళ్లు..మద్యం రేటు పెరిగిందా..పెరిగిందా..పెరిగిందా లేదా అంటూ రంకెలు వేసాడు..కావాల్సిన బాండ్లు ఉన్నాయా లేదా అంటూ..మందుబాబులకు సరైన బ్రాండ్లు దొరకడం లేదంటూ వాపోయారు..ఇంకా అంతటితో ఆగలేదు బాబుగారు. మిమ్మల్ని అడుగుతున్నా…ఏదో ఒక బలహీనతతో  ఒక పెగ్గేసుకునేవాళ్లకు..ఈ పనిష్మెంట్ ఏంటీ..ఈ శిక్ష ఏంటీ అని అడుగుతున్నా..అంటూ ప్రశ్నించారు.

పాపం తమలాంటి తాగుబోతుల తరపున వకాల్తా పుచ్చుకుని ప్రభుత్వాన్ని నిలదీస్తున్న చంద్రబాబును చూసి మందుబాబులు ఆనందంతో ఉప్పొంగిపోయారు…ఒకటే ఈలలు, చప్పట్లు..అబ్బబ్బబ్బ… మాలాంటి మందుబాబుల కోసం బాబుగారు చేస్తున్న ఈ పోరాటం నెవర్ బిఫోర్…ఎవ్వర్ ఆఫ్టర్ మందుబాబులు భుజాలు ఎగరేసుకుంటూ చెబుతుంటే..మహిళలు మాత్రం ఈయనేం పోయేకాలం వచ్చింది…ఇప్పడిప్పుడే మద్యం రేట్లు పెరిగి..ఇంట్లో మగవాళ్లు మందుతాగడం మానేస్తుంటే..ఈయనేంటీ మద్యం రేట్లు పెంచారంటూ తిడుతున్నాడు..ఇంత వయసొచ్చింది.. తాగుబోతులను వెనకేసుకురావడానికి ఆ మాత్రం బుద్ధి, జ్ఞానం ఉండక్కర్లే అంటూ చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మొత్తానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కాస్తా..తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మారాడంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో సెటైర్లు పడుతున్నాయి. కావాలంటే ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది.

తాగుబోతుల‌కు అధ్య‌క్షుడిగా మారిన చంద్ర‌బాబు.

Publiée par YSRCP Womens Wing sur Jeudi 20 février 2020

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat