Home / ANDHRAPRADESH / బ్రేకింగ్..రేపే మరో సంచలన పథకానికి సీఎం జగన్ శ్రీకారం..!

బ్రేకింగ్..రేపే మరో సంచలన పథకానికి సీఎం జగన్ శ్రీకారం..!

అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా పలు సంక్షేమ పథకాలను ప్రారంభిస్తూ ఏపీ ప్రజలను ఆదరాభిమానాలను పొందుతున్న సీఎం జగన్ ఫిబ్రవరి 24 న మరో సంచలన పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం నాడు విజయనగరం జిల్లాలో ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి స్వయంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ విజయనగరం జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. ఫిబ్రవరి 24, సోమవారం ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరతారు. 11 గంటలకు విజయనగరం పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలకు చేరుకుని.. అక్కడ నుంచి విజయనగరం అయోధ్య మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించనున్నారు. 11.25 నిమిషాలకు వైఎస్సార్‌ జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించి.. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడ నుంచి పోలీస్‌ బ్యారెక్స్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కార్యక్రమాలు ముగించుకుని తిరిగి హెలికాఫ్టర్‌లో విశాఖపట్నం, అక్కడి నుంచి విమానంలో గన్నవరం వెళతారు.

కాగా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ‘జగన్నన్న వసతి దీవెన’ కింద నిరుపేద కాలేజీ విద్యార్థుల హాస్టల్, భోజనం ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుంది. ఈ నెల 25న ప్రతి గ్రామంలో వలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఈ పథకంకు సంబంధించిన కార్డు, ముఖ్యమంత్రి సందేశాన్ని విద్యార్థుల తల్లిదడ్రులకు ఇచ్చి రశీదును పొందుతారు. ఈ పథకం కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రి, పీజీ విద్యార్థులకు రూ.20 వేలు ఆర్థిక సాయం అందింస్తారు. మొత్తంగా తమ బిడ్డలు కాలేజీల్లో ఉన్నత విద్యలు ఉచితంగా చదుకునేందుకు వీలుగా జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభిస్తున్న సీఎం జగన్‌‌ కలకాలం ఇలాగే పాలించాలని…రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు దీవిస్తున్నారు. మాట తప్పని..మడమ తిప్పని నేత జగన్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat