ఇండియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ,భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య ఒక రక్షణ ఒప్పందం జరగనున్నది.
ఇందులో భాగంగా ఈ రోజు భేటీ కానున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్,భారత ప్రధానమంత్రి నరేందర్ మోదీ మధ్య మూడు బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పంద పత్రాలపై చర్చ జరిగే అవకాశముంది.
24MH-60 రోమియో,ఆరు AH64E అపాచీ హెలికాప్టర్లను భారత్ కొనుగోలు చేయనున్నదని సమాచారం. నేవీకి రోమియో,ఆర్మీకి అపాచీ హెలికాప్టర్లను భారత్ ఇవ్వనున్నది.
అయితే ఉదయం రాష్ట్రపతి భవన్ ను ట్రంప్ దంపతులు సందర్శించారు. వారికి రాష్ట్రపతి భవన్ వర్గాలు ఘనంగా స్వాగతం పలికాయి.