Home / INTERNATIONAL / ప్రపంచంలోనే అత్యంత కుర వృద్దుడు ఇక లేరు

ప్రపంచంలోనే అత్యంత కుర వృద్దుడు ఇక లేరు

ప్రపంచంలోనే అత్యంత వృద్దుడిగా జపాన్‌కు చెందిన చిటెట్సు వటనాబె(112) గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. 112 ఏళ్ల వయస్సులోనూ ఎంతో ఉత్సాహంతో నవ్వుతూ ఫొటో దిగిన ఆయన ఇక లేరు. చిటెట్సు వటనాబె ఆదివారం తుదిశ్వాస విడిచారని.. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించినట్లు గిన్నీస్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి జ్వరం, శ్వాసంబంధ సమస్యల కారణంగా వటనబె ఆహారాన్ని తీసుకునే పరిస్థితిలో లేరు. చిటెస్తు వటనాబేకు ఐదుగురు సంతానం కాగా..12 మనవళ్లు, 17 ముని మనవండ్లు ఉన్నారు.

గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధుల వివరాల ప్రకారం చిటెట్సు వటనాబె 1907లో ఉత్తర జపాన్‌లోని నీగటాలో జన్మించాడు. చిటెట్సు వటనాబె అగ్రికల్చర్‌ స్కూల్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత తైవాన్‌లోని దాయ్‌-నిప్పన్‌ మెయిజి షుగర్‌ కంపెనీలో కాంట్రాక్టు పనుల్లో చేరాడు. చిటెట్సు 18 ఏళ్లుగా తైవాన్‌లో నివసిస్తున్నాడు. అనంతరం మిట్సు అనే మహిళను వివాహమాడగా వారికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తిరిగి తన స్వస్థలమైన నీగటకు చేరుకున్న అతను ప్రస్తుతం అక్కడే కాలం వెళ్లదీస్తున్నాడు. ఇక ఇంత వయస్సు మీదపడ్డ ఇప్పటికీ తన పొలంలో పండ్లు, కూరగాయలు పండిస్తూ నేటితరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే ఆయన తాజాగా ఎక్కువ ఆయుష్షుతో జీవించడానికి గల రహస్యాన్ని బహిరంగంగా చెప్పుకొచ్చాడు. ‘ఎప్పుడూ కోపానికి రాకండి. ముఖాలపై చిరునవ్వును చెరగనీయకండి’ అని విలువైన సలహా ఇచ్చాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat