Home / ANDHRAPRADESH / విశాఖ ల్యాండ్‌పూలింగ్‌పై బెడిసికొట్టిన టీడీపీ వ్యూహం..!

విశాఖ ల్యాండ్‌పూలింగ్‌పై బెడిసికొట్టిన టీడీపీ వ్యూహం..!

ఏపీలో ఉగాది నాడు పేదలకు దాదాపు 25 లక్షల ఇండ్ల పట్టాలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో విశాఖలో 6 వేల ఎకరాల భూసేకరణకు పూనుకుంది. అయితే అమరావతిలో రాజధాని కోసమని ల్యాండ్ పూలింగ్ పేరుతో 33 వేల ఎకరాలు సేకరించి తన బినామీలకు, తన సామాజికవర్గానికి అప్పనంగా భూములను దోచిపెట్టిన చంద్రబాబు.. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు జగన్ సర్కార్ చేస్తున్న ల్యాండ్ పూలింగ్‌ను వ్యతిరేకిస్తున్నాడు. విశాఖలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ లక్షలాది మంది గళమెత్తినప్పుడు కానీ.. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ కావాలని వర్గాలకు అతీతంగా వేలాది మంది రోడెక్కినపుడు కానీ.. కనిపించని చంద్రబాబు.. ఇప్పుడు పెందుర్తి మండలం పినగాడి గ్రామానికి వెళ్లడానికి ఏకంగా విమానంలో వెళ్లాడంటే అక్కడేమి పెద్ద సమస్య కాదు..కేవలం 9 ఎకరాల ప్రభుత్వ గయాళు భూమికి సంబంధించి  ఓ 12 మంది రైతుల వ్యక్తిగత సమస్య.. అయితే ప్రభుత్వం పెద్దమనసుతో వారికి భారీగా పరిహారం చెల్లించాలని భావించినా టీడీపీ రాజకీయం చేయాలని కుట్ర చేసింది.  వికేంద్రీకరణకు  వ్యతిరేకంగా అమరావతికి జై కొట్టిన చంద్రబాబుకు విశాఖలో అడుగుపెట్టడానికి ధైర్యం చాలేదు. ఇప్పుడు ఆ 12 మంది రైతులకు అన్యాయం జరుగుబోతుందంటూ వారిని పరామార్శించే పేరుతో విశాఖలో అడుగుపెట్టాలని చూశాడు. కాని ఉత్తరాంధ్ర ప్రజల తిరుగుబాటుతో విశాఖ ల్యాండ్‌పూలింగ్‌పై రాజకీయం చేద్దామన్న టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పెందుర్తి మండలం పినగాడి గ్రామ రెవెన్యూ రికార్డు ప్రకారం సర్వే నంబరు 141/1లో మొత్తం 32.88 ఎకరాలూ గయాళు భూమే. గయాళు భూమి అంటే ప్రభుత్వ భూమే.. అందులో 9 ఎకరాలు ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో తీసుకోవాలనేది జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఉద్దేశం. టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నట్లు అక్కడ చెరువు గర్భం అనేదీ లేదని రెవెన్యూ అధికారులు విస్పష్టంగా చెబుతున్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ వల్ల ఆ గయాళు భూమిని ఆక్రమించుకొని ఇన్నాళ్లూ అనుభవంలో ఉంచుకున్న 12 మంది రైతులకూ దీని వల్లే మేలు జరగనుంది. ఎకరానికి 900 చదరపు గజాల చొప్పున లేఅవుట్‌లో స్థలం పరిహారంగా దక్కుతుంది. పరిసరాల్లో ఉన్న మార్కెట్‌ రేట్‌ ప్రకారం చదరపు గజం రూ.20వేల చొప్పున లెక్క చూసినా దాని విలువ సుమారుగా రూ.1.80 కోట్లు ఉంటుంది. ఈ ప్రకారం 9 ఎకరాలకు 12 మంది రైతులకు రూ.16.20 కోట్లు విలువైన ఆస్తి ప్రతిఫలంగా దక్కనుంది. అంతేకాదు మరోవైపు 432 మంది పేదలకు సెంటు చొప్పున ఇంటి స్థలం సమకూర్చడానికి పరోక్షంగా సహాయం చేసినవారూ అవుతారు. ఇదే విషయాన్ని రైతులకు నచ్చజెప్పారు. కానీ టీడీపీ నాయకులు భూసమీకరణను రణరంగం చేయడానికి కుతంత్రాలు చేశారు. అంతేకాదు ఏకంగా చంద్రబాబును పినగాడి తీసుకొచ్చి రాజకీయంగా రచ్చ చేయాలని కుట్ర చేశారు. అందుకే విజయనగరంలో పర్యటనకు, విశాఖ జిల్లాలో రెండు వివాహ కార్యక్రమాల కోసం వస్తున్న చంద్రబాబు షెడ్యూల్‌ను ఒక్కసారిగా మార్చేశారు. అయితే తీరా ఉత్తరాంధ్ర ప్రజల నిరసన సెగ తగలడంతో చంద్రబాబు పినగాడికి రాకుండానే వెనుదిరిగారు. దీంతో తొమ్మిది మంది రైతుల పరామర్శ పేరుతో రాంపురం వద్ద లక్షల రూపాయల ఖర్చుతో చేసిన వేదిక, ఇతరత్రా ఏర్పాట్లు వృథాగానే మిగిలాయి. మొత్తంగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఉత్తరాంధ్ర ప్రజల చేతిలో బ్యాండ్ పడితే..పినగాడిలో తెలుగు తమ్ముళ్లు టెంట్లు ఎత్తేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat