ఛలో మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల రాక్షసి రష్మిక మంధాన. చక్కని అభినయంతో.. అందాలను ఆరబోస్తూ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వరుస చిత్రాలతో.. వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ రేంజ్ హీరోయిన్ స్థాయికెదిగింది ఈ అందాల రాక్షసి.
ఇటీవల సరిలేరు నీకెవ్వరు,భీష్మ చిత్రాల విజయాలతో ముందువరుసలో ఉన్నారు. తాజాగా రష్మిక ఫ్యామిలీతో ఉన్న ఫోటోను ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో రష్మిక చెల్లిని గమనిస్తే ఆమె వయస్సు ఆరు లేదా ఏడేళ్లు ఉంటుందనిపిస్తుంది.
23 ఏళ్ళ రష్మికకి ఇంత చిట్టి చెల్లెలు ఉందా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. రష్మిక మందన చెల్లి పేరు శిమన్ మందన. తండ్రి పేరు మదన్ మందాన .. ఈ ముద్దుగుమ్మ తల్లి పేరు సుమన్ .