Home / SLIDER / డీసీసీబీ, డీసీఎంఎస్‌ లలో టీఆర్ఎస్ విజయకేతనం

డీసీసీబీ, డీసీఎంఎస్‌ లలో టీఆర్ఎస్ విజయకేతనం

తెలంగాణ రాష్ట్రంలోని 9 డీసీసీబీ, డీసీఎంఎస్‌లను టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఉమ్మడి జిల్లాలవారీగా విజేతల వివరాలిలా ఉన్నాయి. 
 
– కరీంనగర్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కొండూరు రవీందర్‌ రావు,  వైస్‌ చైర్మన్‌గా పింగళి రమేష్‌ ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీఎంఎస్‌ చైర్మన్‌గా శ్రీకాంత్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా ఫకృద్దీన్‌ ఎన్నికయ్యారు. 
 
– నల్లగొండ జిల్లా  డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీఎంఎస్‌ చైర్మన్‌గా వట్టి జానయ్య యాదవ్‌, వైస్‌ చైర్మన్‌గా దుర్గంపూడి నారాయణరెడ్డి ఎన్నికయ్యారు.  
 
– నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా భాస్కర్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా రమేష్‌రెడ్డి ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీఎంఎస్‌ చైర్మన్‌గా సాంబారి మోహన్‌, వైస్‌ చైర్మన్‌గా ఏదుల్లా ఇంద్రాసేనా రెడ్డి ఎన్నికయ్యారు. 
 
– ఆదిలాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా నాందేవ్‌ కాంబ్లే, వైస్‌ చైర్మన్‌ రఘునందన్‌ రెడ్డి ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీఎంఎస్‌ చైర్మన్‌గా తిప్పని లింగయ్య, వైస్‌ చైర్మన్‌గా కొమురం మాంతయ్య ఎన్నికయ్యారు. 
 
– రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా బి.మనోహర్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా సత్తయ్య ఎన్నికయ్యారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా కృష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్‌గా మధుకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. 
 
– మెదక్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా పట్నం మాణిక్యం ఎన్నికయ్యారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా శివకుమార్‌, వైస్‌ చైర్మన్‌గా రమేష్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. 
 
– ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కురాకుల నాగభూషణం, వైస్‌ చైర్మన్‌గా దొండపాటి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రాయల వెంకటశేషగిరిరావు, వైస్‌ చైర్మన్‌ కొత్వాల్‌ శ్రీనివాస్‌ రావు ఎన్నికయ్యారు. 
 
– మహబూబ్‌నగర్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా నిజాం పాషా, వైస్‌ చైర్మన్‌గా వెంకటయ్య ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ప్రభాకర్‌ రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా హర్యానాయక్‌ ఎన్నికయ్యారు. 
 
– వరంగల్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా మార్నేని రవీందర్‌, వైస్‌చైర్మన్‌ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి ఎన్నికయ్యారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోతు రామస్వామినాయక్‌, వైస్‌ చైర్మన్‌ దేశిడి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat