Home / LIFE STYLE / కరోనా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కరోనా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కరోనా వ్యాధికి వ్యాక్సిన్‌ లేదు.కేవలం నివారణ ఒక్కటే మార్గం.ఇందులో భాగంగా మరి ముఖ్యంగా వైరస్‌ ఉన్న చైనా, వ్యాధి ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణాలను నిలిపేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. చేతులు సబ్బుతో తరచూ కడుక్కోవాలి. తుమ్మినపుడు, దగ్గినపుడు మూతికి టవల్‌, చేతిరుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్‌లు ధరించాలి. జన సమూహం ఉండే ప్రాంతాల్లో ఎక్కువ సేపు ఉండొద్దు. వీలైనంత వరకు చలి ప్రదేశాల్లో తిరుగొద్దు. గర్భవతులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెంపుడు జంతువులతోనూ జాగ్రత్తలు అవసరం.ముందుగా మనం బయటకు వెళ్లినప్పుడు సర్జికల్ మాస్క్ లాంటిది ధరించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ వైరస్ ఎక్కువ గా ఒకరినుండి ఒకరికి గాలి ద్వారానే సోకుతుంది కాబట్టి…. అలాగే ఆ మాస్కులను తరచూ మార్చడం మంచిది…

ఇకపోతే తరచూ ముఖ్యంగా ఏదైనా వస్తువును తాకిన వెంటనే శుభ్రంగా చేతులు కనీసం ఇరవై సెకండ్ల పాటు సబ్బు లేదా హాండ్ వాష్ తో కడిగేసుకోవాలి…అలాగే మన చేతులతో తరచూ కళ్ళను నోటిని ముక్కును తాకడం కళ్లు నలుపుకోవడం లాంటి పనులు చేయరాదు….ముఖ్యంగా జన సమూహాలకు దూరంగా ఉండడం ఎవరైనా అనారోగ్యం తో లేదా జలుబు, దగ్గుతో బాధ పడేవారికి దూరంగా ఉండడం మంచిది…ఇతరులకు షేక్ హాండ్ ఇవ్వకపోవడం చాలా మంచిది.

మన ఇంట్లో సభ్యులకు ఎవరికైనా తీవ్ర జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి లాంటి అసాధారణ లక్షణాలు కనపడితే వెంటనే ఆ వ్యక్తిని శుభ్రమైన బాగా గాలీ వెలుతురు ఉండే ఒక గదిలో ఉంచి మిగతా కుటుంబ సభ్యులు మాస్కులు ధరించి ఆ వ్యక్తికి దూరంగా ఉండి అతన్ని వెంటనే సంబంధిత ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించి తగిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలి…అలాగే కొన్నాళ్ళు మాంసాహారం లాంటి వాటిని పరిమితంగా తినండి….ఒకవేళ తినాలనిపిస్తే బాగా ఉడికించి మాత్రమే తినాలి..అలాగే పెంపుడు జంతువులూ, పక్షులకు దూరంగా ఉండడం వాటిని తాకకుండా ఉండడం చాలా మంచిది….ఇలా ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉంటే, ఈ వ్యాధి గురించి తెలియనివారికి కూడా అవగాహన కల్పిస్తే కరోనా రాకుండా జాగ్రత్త పడొచ్చు…

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat