Home / ANDHRAPRADESH / ఈ తాగుబోతు పంచాయతీ ఏంటీ చంద్రబాబు.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్..!

ఈ తాగుబోతు పంచాయతీ ఏంటీ చంద్రబాబు.. డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్..!

ఏపీలో పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్ దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులను మూసివేయించారు. కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చి ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తోంది. అలాగే మద్యం రేట్లను విపరీతంగా పెంచింది..మరోవైపు మద్యం షాపులు పని చేసే వేళలను రాత్రి 8 గంటలకే కుదించింది. దీంతో ఏపీలో క్రమంగా మద్యం విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఈ విషయంలో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తుంటే..టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు మద్యం రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి, అన్ని రకాల మద్యం బ్రాండ్లు దొరకడం లేదంటూ తాగుబోతు సంఘం నేతల్లా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవల జన చైతన్యయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు…తమ్ముళ్లు..మద్యం రేట్లు పెరిగాయా లేదా…అన్ని రకాల మద్యం బ్రాండ్లు దొరుకుతున్నాయా లేదా…ఏదో బలహీనతతో పెగ్గేసుకునేవాళ్లకు ఈ ఖర్మేంటీ అంటూ మందుబాబుల తరపున వకాల్తా పుచ్చుకుని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో చంద్రబాబు టీడీపీ అధ్యక్షుడా…తాగుబోతుల సంఘం అధ్యక్షుడా అంటూ వైసీపీ నేతలతో సహా సోషల్ మీడియాలో నెట్‌జన్లు చెడుగుడు ఆడారు. అయినా టీడీపీ నేతలు మద్యాన్ని పట్టుకుని వదలడం లేదు.

తాజాగా టీడీపీ నేత బోండా ఉమ ప్రెస్‌మీట్ పెట్టారు…రకరకాల మద్యం బ్రాండ్లతో కూడిన మందుబాటిళ్లను పట్టుకుని మరీ వచ్చి…రాష్ట్రంలో ఖరీదైన మద్యం బ్రాండ్లు దొరకడం లేదని,చీప్ బ్రాండ్లు మాత్రమే దొరుకుతున్నాయి..ఇలా అయితే మందుబాబుల ఆరోగ్యం ఏం కావాలని… మద్యం ప్రియుడిలా వాపోయాడు. కొత్త మద్యం విధానాన్ని అడ్డుగా పెట్టుకుని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట్ల రూపాయల మేర కమిషన్లు పిండుకుంటున్నారంటూ ఆరోపించాడు. కమిషన్లను ఇచ్చే మద్యం బ్రాండ్లను మాత్రమే అమ్మకాలకు అనుమతి ఇస్తున్నారని చిందులేశాడు. చంద్రబాబు, టీడీపీ నేతల విమర్శలపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. మద్యపాన నిషేదమనేది మహిళల కోసం తీసుకున్న నిర్ణయమని, ఆ నిర్ణయమే నేరాలకు కారణంగా మారిందని టీడీపీ నేతలు ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదని ఆయన అన్నారు. మద్యం బాటిళ్లకు కమిషన్‌లు తీసుకోవాల్సిన కర్మ మాకేం పట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మద్యపాన నిషేదం నిర్ణయం వల్ల రాష్ట్రంలోని మహిళలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారన్నారు. టీడీపీ పనిగట్టుకొని బురద జల్లే ప్రయత్నాలు చేస్తుందని, అసలు సాయంత్రం పూట పెగ్గులు వేసుకోవాలని చెప్పే చంద్రబాబు ముఖ్యమంత్రి ఎలా అయ్యారని ప్రశ్నించారు. చంద్రబాబు ఓ ప్రతిపక్ష నేతగా కాకుండా…తాగుబోతుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మద్యం రెట్లు విపరీతంగా పెరిగిపోయాయంటూ లోకేష్‌ చెప్పడం మరీ హాస్యాస్పదంగా ఉందన్నారు. నిజం చెప్పాలంటే టీడీపీ నాయకులంతా లిక్కర్‌ సిండికేట్‌లేనని నారాయణస్వామి మండిపడ్డారు. అవసరమనుకుంటే మద్యపానం నిషేదం ఎత్తేయాలని చంద్రబాబుకు ప్రతీ గ్రామం తిరిగే అవకాశం తాము కల్పిస్తామని, అప్పుడు ప్రజలే బాబుకు బుద్ది చెబుతారని నారాయణస్వామి ఫైర్ అయ్యారు. పేదవాడు పైకి వస్తే బాబు ఓర్చుకోలేడని, అందుకే ఆయన ఇలాంటి తలతిక్క పనులు చేస్తున్నారని నారాయణస్వామి ధ్వజమెత్తారు. మొత్తంగా మద్యం రేట్లు పెరిగిపోయాయి…మద్యం బ్రాండ్లు దొరకడం లేదంటూ టీడీపీ చేస్తున్న రాజకీయంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అవసరమైతే చీప్‌ లిక్కర్, నాటు సారాను నియంత్రించమని విమర్శలు చేయాలి కానీ…ఇలా మందు రేట్లు, బ్రాండ్లపై ఈ తాగుబోతు పంచాయతీ ఏంటీ…చంద్రబాబుకు ఏమైనా మతిపోయిందా అంటూ ప్రజలు మండిపడుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat