Home / ANDHRAPRADESH / ప్రజా చైతన్య యాత్రలో లోకేష్‌‌‌కు ఘోర అవమానం.. తరిమికొట్టిన తూగో జిల్లా రైతులు, స్థానికులు…!

ప్రజా చైతన్య యాత్రలో లోకేష్‌‌‌కు ఘోర అవమానం.. తరిమికొట్టిన తూగో జిల్లా రైతులు, స్థానికులు…!

ప్రజా చైతన్య యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు అడుగుడుగునా ఘోర అవమానాలు ఎదుర్కొంటున్నారు. అమరావతికి జై కొట్టి కర్నూలు, వైజాగ్‌లలో రాజధానుల ఏర్పాటుపై కుట్ర చేస్తున్న ఈ తండ్రీ కొడుకుల తీరుపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు తీవ్ర‍ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వైజాగ్‌లో అడుగుపెట్టిన చంద్రబాబుకు, ఉత్తరాంధ్ర ప్రజలు చెప్పులు, టమాటాలు, గుడ్లు వేసి అడ్డుకున్నారు. ఐదుగంటల పాటు చంద్రబాబు ఎయిర్‌పోర్ట్‌లో నడిరోడ్డు మీద కూర్చుని పోలీసులపై చిందులు వేసినా…ప్రజలు ఏ మాత్రం వెనకడుగువేయలేదు. దీంతో ఘోర అవమానంతో చంద్రబాబు హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోయాడు. అంతకు ముందు చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ప్రజల నిరసన ఎదుర్కోవాల్సి వచ్చింది.

 

తాజాగా చంద్రబాబు పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌కు కూడా తండ్రికి దక్కినట్లే ఘోర పరాభావం ఎదురైంది. ప్రజా చైతన్యయాత్రలో భాగంగా లోకేష్ తూగో జిల్లా సీతానగరం మండలం, రఘుదేవపురంలో పర్యటించారు. అదే సమయంలో మునికూడలి వద్ద పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్వాసితులు, రైతులు ధర్నా చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో పురుషోత్తపట్నం పథకం కోసం తమ భూములు లాక్కుని ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదని ఆందోళన చేస్తూ కాటవరం రైతులు నిరసనకు దిగారు. సరిగ్గా అదే సమయంలో యాత్రలో భాగంగా లోకేష్ మునికూడలికి వెళ్లాడు.. అప్పటికే ఆగ్రహంతో ఉన్న రైతులు లోకేష్‌‌ను ఒక్కసారిగా అడ్డుకున్నారు. వారికి వైసీపీ కార్యకర్తలు మద్దతు ఇచ్చారు.

 

ఈ సందర్భంగా చంద్రబాబు హయాంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల నిర్వాసితులకు ఇప్పటి వరకు పరిహారం అందలేదని…రైతులు లోకేష్‌పై విరుచుకుపడ్డారు. అంతే కాదు నారా లోకేష్ గో బ్యాక్ అంటూ..అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రైతులు, వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో పోలీసులు రంగంలోకి దిగి అందరిని చెదరగొట్టారు. ఈ గొడవలో ఇరుపార్టీల కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రజా చైతన్యయాత్రలో తనకు ఎదురైన నిరసనతో లోకేష్ బిత్తరపోయాడు..షరామామూలుగా పులివెందుల గూండాలు, ఇడుపులపాయ దొంగలు, వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు 40 మంది తనపై దాడి చేశారంటూ అక్కసు వెళ్లగక్కాడు. మొత్తంగా నవమోసాల పాలన అంటూ జగన్ సర్కార్‌ను బద్నాం చేయాలని ప్రజా చైతన్యయాత్రలు చేపట్టిన తండ్రీకొడుకులకు ప్రజల చేతిలో ఊహించని పరాభవాలు ఎదురవుతున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat