Home / ANDHRAPRADESH / చంద్రబాబు విమర్శలపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్..!

చంద్రబాబు విమర్శలపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్..!

స్థానిక ఎన్నికల వేళ..చంద్రబాబుకు పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి షాక్ ఇచ్చారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసిన సతీష్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 20 ఏళ్లుగా వైయస్ కుటుంబంతో పోరాడుతున్న పార్టీలో తగిన గౌరవం లేదని, చంద్రబాబుతో గ్యాప్ పెరిగిందని సతీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సతీష్ రెడ్డి రాజీనామాపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. టీడీపీకి రాజీనామా చేసిన సతీష్ రెడ్డి మాటలతో అయినా సిగ్గు తెచ్చుకో చంద్రబాబు అంటూ పెద్దిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ చిత్తూరు జిల్లాలో బాబు మెజారిటీ సీట్లు గెలిపించలేకపోయారని ఎద్దేవా చేశారు. , డొక్కా మాణిక్యవరప్రసాద్‌, రెహమాన్ వంటి సీనియర్ నేతలు టీడీపీకి ఎందుకు రాజీనామా చేశారో చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి హితవు పలికారు.

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని తెలిసే చంద్రబాబు వైసీపీపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి ఆక్షేపించారు. ఎక్కడైనా డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామంటే ప్రతిపక్ష పార్టీగా స్వాగతించాలే కాని…చంద్రబాబు మాత్రం వైఎస్సార్‌సీపీ అక్రమంగా, దౌర్జన్యంగా ఎన్నికలు నిర్వహిస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారని పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. దీన్ని బట్టి ఇన్నాళ్లు డబ్బు. మద్యంతోనే ఎన్నికల్లో గెలుస్తున్నామని చంద్రబాబు ఒప్పుకున్నారని కౌంటర్ ఇచ్చారు. ఓడిపోతామనే తెలిసే చంద్రబాబు సీఎం జగన్‌పై, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని పెద్దిరెడ్డి అన్నారు. ఇక గ్రామవాలంటీర్లను ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నామని టీడీపీ నేతలు వారిపై భౌతికదాడులు చేయడాన్ని మంత్రి ఖండించారు. వాలంటీర్లు వాళ్ల పని వాళ్లు చేస్తున్నారని వాళ్ళు రేషన్ కార్డుల పంపిణీ, ఇళ్ల పట్టాలు ఇతరత్రా 60 రకాల పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామనే ఉక్రోషంతోనే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇక తనపై చేసిన ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య విమర్శ, ప్రతివిమర్శలతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat