ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు మొత్తం ఒక్కొకటిగా నేరవేరుస్తున్నాడు. అటు రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు ఇలా అన్ని విభాగాల్లో అందరికి సమాన న్యాయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే స్కూల్స్ విషయానికి వస్తే మంగళవారం నాడు స్కూల్ ఎడ్యుకేషన్‌పై క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందులో జగన్ విద్యా కానుకలో ఆరు రకాల వస్తువులు ఉంటాయి. మూడుజతల యూనిఫారమ్స్, షూ, సాక్స్, బెల్టు, బ్యాగు, టెక్ట్స్ బుక్స్ నమూనాలను సీఎంకు అధికారులు చూపించారు. అంతేకాకుండా నాడు – నేడు తొలివిడతలో భాగంగా 15,715 స్కూళ్లలో పనులు ప్రారంభించనున్నారు.