మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్ బోర్డు నుండి తప్పుకోవాలని బిల్ గేట్స్ నిర్ణయించుకున్నారు. సరిగ్గా 1975లో పాల్ అల్లెన్ తో కల్సి బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ ను స్థాపించారు.
అప్పటి నుండి చాలా కాలం సీఈఓగా పని చేశారు. గత కొంతకాలంగా సేవ కార్యక్రమాలపై దృష్టి పెట్టిన బిల్ గేట్స్ సేవపనులపైనే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు అని తెలుస్తుంది.
అందుకే ఒక పక్క సేవ కార్యక్రమాలపై సమయం కేటాయిస్తే మైక్రోసాఫ్ట్ పనులపై దృష్టి తగ్గుతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.